Viral Video: ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఇలా పాము వస్తుంది జాగ్రత్త.. రూల్స్ పాటించనివారిపై స్నేక్ అటాక్!.. వీడియో వైరల్..
Viral Video: ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని.. ట్రాపిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన చాలా మంది పెడచెవిన పెడుతుంటారు.
Viral Video: ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని.. ట్రాపిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన చాలా మంది పెడచెవిన పెడుతుంటారు. రూల్స్ పాటించనివారికి జరిమానాలు విధించినా… పలు రకాల శిక్షలు విధించిన ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదు. ద్విచక్ర వాహనం పై కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని.. ఇద్దరూ హెల్మెట్స్ ధరించాలని పోలీసులు పలుమార్పు చెప్పిన ఎవ్వరు వినడం లేదు. బైక్ పై ఇద్దరు కాదు ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు ప్రయాణిస్తున్న యువకులకు అనుకోని అతిధిగా వచ్చి వణుకు పుట్టించింది ఓ పాము. నలుగురు కాకుండా.. తాను కూడా వస్తా అనేలా బైక్‌లోకి దూరింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో…. ఒక బైక్ పై ఏకంగా నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా.. పక్కనే ఉన్న పంటపొలాల్లో నుంచి ఓ పాము వారు ప్రయాణిస్తున్న బైక్‌లోకి దూరింది. దీంతో ఒక్కసారిగా అందరూ భయంతో బైక్ దిగడానికి ప్రయత్నించగా.. ఒకరిపై ఒకరు పడి.. వెంటనే పరుగు అందుకున్నారు. ఈ తతంతగాన్ని మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Snake Attack On Bike: వీడియో..
View this post on Instagram