Funny Fight: ఎవరైనా సరే తగ్గేదేలే..! కుక్కను పరుగులు పెట్టించిన పిల్ల కోడి.. వీడియో చూస్తే నవ్వులే..

Chicken vs Puppy: సాధారణంగా కుక్క పిల్లను చూస్తే ఏ కోడి అయినా కంటికి కనిపించనంతగా పరుగులు తీయడం లేదా దాక్కోవడం చేస్తోంది. ఇలా కోళ్లను వేటాడుతున్న కుక్కలను, అందుకు సంబంధించిన వీడియోలను మనం ఎన్నో

Funny Fight: ఎవరైనా సరే తగ్గేదేలే..! కుక్కను పరుగులు పెట్టించిన పిల్ల కోడి.. వీడియో చూస్తే నవ్వులే..
Chicken vs Puppy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 20, 2023 | 4:26 PM

Chicken vs Puppy: సాధారణంగా కుక్క పిల్లను చూస్తే ఏ కోడి అయినా కంటికి కనిపించనంతగా పరుగులు తీయడం లేదా దాక్కోవడం చేస్తోంది. ఇలా కోళ్లను వేటాడుతున్న కుక్కలను, అందుకు సంబంధించిన వీడియోలను మనం ఎన్నో చూసి ఉంటాం.  అందులో వింతేమి లేదు. అయితే ఒక కుక్కను కోడి పరుగులు తీయించడం అంటే చెప్పుకోదగిన అశ్చర్యకరమైన విషయమే కదా..! తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.

అసలు నెట్టింట హల్‌చల్ చేస్తొన్న ఆ వీడియోలో ఏం జరిగిందంటే.. ఓ కుక్క పిల్లను వెంటాడుతోంది మరో కోడి పిల్ల. దాన్ని తన ముక్కుతో పొడిచి పొడిచి తరుముతోంది. విశేషమేమంటే ఆ కోడి పిల్ల తల్లి కుక్క ముందే దాని బిడ్డతో ఫైట్ చేస్తోంది. ఇంకా ఒకనొక సమయంలో ఆ కుక్క పిల్ల దాని తల్లి చాటున దాక్కుంటే.. ఆ కోడి పిల్ల తల్లి కుక్క మీద ఎక్కి నిలబడి మరీ చిన్న కుక్క మీదకు దూకి కొట్టింది. ఇలా సాగిన వీడియోను చూసిన నెటిజన్లు కోడి పిల్లను ‘రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సీనా’తో పోలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 82 వేలకు పైగా లైకులు, పది లక్షలకు పైగా వీక్షణలు అందాయి. అలాగే పలువురు నెటిజన్లు కూడా తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..