‘దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం’.. ట్విట్టర్ వేదికగా తెలియజేసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్..

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంలో ఆపిల్ తన రిటైల్ పుష్‌ను మరింతగా బలపరుచుకోవాలని ప్రయత్నించేస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘బిజనెస్ ట్రిప్’ పేరిట వచ్చిన యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్....

‘దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం’.. ట్విట్టర్ వేదికగా తెలియజేసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్..
Apple Ceo Tim Cook And Pm Narendra Modi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 19, 2023 | 8:29 PM

ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంలో ఆపిల్ తన రిటైల్ పుష్‌ను మరింతగా బలపరుచుకోవాలని ప్రయత్నించేస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘బిజనెస్ ట్రిప్’ పేరిట వచ్చిన యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్.. తన పనులను సాఫీగా పూర్తి చేసుకున్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో యాపిల్ స్టోర్‌లను ప్రారంభించిన అనంతరం దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఇప్పటికే కలిశారు. ఈ క్రమంలోనే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా టిమ్ కుక్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా వృద్ధి చెందడానికి, పెట్టుబడులు పెట్టడానికి యాపిల్ కంపెనీ కట్టుబడి ఉంద’ని నొక్కి చెప్పారు.

అలాగే ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని ఉద్దేశిస్తూ ‘సాదర స్వాగతం పలికినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు. భారతదేశ సాంకేతికత భవిష్యత్తుపై- విద్య, డెవలపర్ల నుంచి తయారీ,  పర్యావరణం వరకు ఉన్న విషయాలపై మీ దృష్టిని మేము పంచుకున్నాడు. దేశమంతటా వృద్ధి చెందడానికి, పెట్టుబడులు పెట్టడానికి మేము కట్టుబడి ఉన్నాము’ అని టిమ్ కుక్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

దీనికి ప్రతిగా ప్రధాని మోదీ కూడా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ట్వీట్‌ను షేర్ చేస్తూ ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. విభిన్న అంశాలపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవడం, భారతదేశంలో జరుగుతున్న సాంకేతిక పరివర్తనలను హైలైట్ చేయడం ఆనందంగా ఉంది’ ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..