Viral: అరుదైన డైనోసార్ అస్థి పంజరానికి వేలం.. ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు బైర్లుకమ్మాల్సిందే
కొన్ని కోట్ల సంవత్సరాల నాటి ఓ అస్థిపంజరం (Skeleton) భారీగా ధర పలికింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఎనిమిదిన్నర కోట్లు పలికి రికార్డు సృష్టించింది. అస్థి పంజరమేంటి. కోట్లు ధర పలకడమేంటని అనుకుంటున్నారా.. అవునండీ.. అది సాదా సీదా...
కొన్ని కోట్ల సంవత్సరాల నాటి ఓ అస్థిపంజరం (Skeleton) భారీగా ధర పలికింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఎనిమిదిన్నర కోట్లు పలికి రికార్డు సృష్టించింది. అస్థి పంజరమేంటి. కోట్లు ధర పలకడమేంటని అనుకుంటున్నారా.. అవునండీ.. అది సాదా సీదా అస్థిపంజరం కాదు.. టీరెక్స్ అనే డైనోసార్ జాతికి చెందిన అస్థి పంజరం మరి. అంతేకాదండోయ్.. ఇది టి రెక్స్ కంటే కూడా వేగంగా కదులుతూ దాడి చేయగలదని, దీని బలం చాలా ఎక్కువని నిపుణులు గుర్తించారు. క్రేటాషియస్ కాలానికి చెందిన భయానక మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్ ఒకటి. ఇది అమెరికా, కెనడా ప్రాంతాల్లో జీవించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గొర్గోసారస్ అస్థి పంజరాన్ని 2018 లో మొట్టమొదటిసారిగా అమెరికాలోని (America) మోంటానాలో ఓ నది సమీపంలో గుర్తించారు. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ అస్థి పంజరం 7.7 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై సంచరించిన డైనోసార్ కు చెందినదిగా నిర్ధారించారు. వేలం వేయడంలో పేరు గాంచిన సోత్ బీ శాల.. జులై 21 నుంచి దీనిని న్యూయార్క్ లో ప్రదర్శనకు ఉంచింది. ఈ క్రమంలో దీనికి వేలం నిర్వహించారు.
ఈ వేలంలో ఈ అస్థిపంజరం 6.1 మిలియన్ డాలర్లు అంటే భారత రూపాయల్లో సుమారు రూ.48.5 కోట్లు ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గార్గోసారస్ లు ఏకంగా 42 వేల న్యూటన్ల బలంతో కొరికేసే శక్తిని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇవి సింహం కంటే పదింతలు బలంతో దాడి చేస్తాయి. అంతకు ముందు 1997లో టీ–రెక్స్ డైనోసార్ అస్థి పంజరాన్ని వేలం వేయగా 8.36 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే 2020లో మరో టీ–రెక్స్ అస్థి పంజరానికి ఏకంగా 31.8 మిలియన్ డాలర్లు అంటే రూ.252.5 కోట్లు పలికింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి