Telugu News Trending Man Shortly escaping from death video was gone viral in Social media Telugu viral
Viral Video: అతనికి రోజులు ఇంకా మిగిలే ఉన్నట్లున్నాయి.. క్షణం ఆలస్యమైతే ప్రాణాలే పోయేవి.. వణుకు పుట్టిస్తున్న వీడియో
మరణం అనేది చాలా బాధకరమైనది. అది జీవితంలో ఏదో ఒక సమయంలో కచ్చితంగా వస్తుంది. కానీ దీనిని ఎవరూ అంతగా ఇష్టపడకపోయినా అది మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే అలాంటి మృత్యువు నుంచి రెప్పపాటు కాలంలో...
మరణం అనేది చాలా బాధకరమైనది. అది జీవితంలో ఏదో ఒక సమయంలో కచ్చితంగా వస్తుంది. కానీ దీనిని ఎవరూ అంతగా ఇష్టపడకపోయినా అది మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే అలాంటి మృత్యువు నుంచి రెప్పపాటు కాలంలో తప్పించుకుంటే.. అతనికి భూమిపై నూకలు బాకీ ఉన్నట్లే. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) మీరు చూసే ఉంటారు. ఇవి భయంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఇది చూస్తే మీకు కచ్చితంగా భయం కలుగుతుంది. మృత్యువు వ్యక్తిపై పడబోతుండగా.. అతను అప్రమత్తమై క్షణకాలంలో దూరంగా వెళ్లడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్లిప్ లో ఒక వ్యక్తి.. తన కారుపై పడిన మంచును క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పై నుంచి ఏదో పడిపోతున్నట్టు అనిపించి పైకి చూస్తాడు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పక్కకు జరుగుతాడు. మరుక్షణమే పై నుంచి పెద్ద వస్తువు దూసుకొచ్చి కారుపై పడుతుంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదే వస్తువు ఆ వ్యక్తిపై పడి ఉంటే అతను ప్రాణాలతో మిగిలేవాడు కాదనే విషయం మనకు వీడియో చూస్తే అర్థమవుతోంది.
వెన్నులో వణుకు పుట్టించే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ 13 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 1 లక్షా 97 వేలకు పైగా వీక్షించగా వేలాది మంది లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు ఇస్తున్నారు. ఆ వ్యక్తి అద్భుతంగా బయటపడ్డాడని, అతనికి భూమిపై నూకలు మిగిలే ఉన్నాయని మరొకరు ఇలా తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు కామెంట్ల రూపంలో రాస్తున్నారు.