Viral Video: ప్రాణాలు పణంగా పెట్టి యువతి చేసిన షాకింగ్ స్టంట్.. మోస్ట్ డేంజరస్ రీల్ వైరల్

వాస్తవానికి సాహస విన్యాసాలు చేయడం తప్పు కాదు.. అయితే స్టంట్స్ పేరుతో తమ ప్రాణాలను పణంగా పెట్టడం నిజంగా తప్పే.. ఇప్పుడు ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోలో ఒక యువతి రీల్ చేయడానికి పెద్ద రాయి చివరి అంచుకు చేరుకుంది. ఆ అమ్మాయి ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలు పోగొట్టుకోవడం ఖాయం. ఈ రీల్ షూట్ పెను ప్రమాదంకరం అని.. ఆమెని చూస్తే భయంగా అనిపిస్తుంది ఎవరికైనా..

Viral Video: ప్రాణాలు పణంగా పెట్టి యువతి చేసిన షాకింగ్ స్టంట్.. మోస్ట్ డేంజరస్ రీల్ వైరల్
Viral NewsImage Credit source: X
Follow us
Surya Kala

|

Updated on: Oct 14, 2024 | 7:37 PM

రోజు రోజుకీ పెరుగుతున్న రీల్స్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతి రోజు ప్రజలు తమను తాము ఫేమస్ అవ్వడానికి వివిధ రకాల రీళ్లను చేస్తున్నారు. ఒక్కోసారి ఈ రీల్స్ చూడ్డానికి ఎగ్జైటింగ్‌గా ఉంటున్నాయి కూడా.. అయితే మరికొన్ని సార్లు తమ ప్రాణాలను పట్టించుకోకుండా చేస్తున్న వీడియోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది.. రీల్స్ పేరుతో ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.

వాస్తవానికి సాహస విన్యాసాలు చేయడం తప్పు కాదు.. అయితే స్టంట్స్ పేరుతో తమ ప్రాణాలను పణంగా పెట్టడం నిజంగా తప్పే.. ఇప్పుడు ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోలో ఒక యువతి రీల్ చేయడానికి పెద్ద రాయి చివరి అంచుకు చేరుకుంది. ఆ అమ్మాయి ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రాణాలు పోగొట్టుకోవడం ఖాయం. ఈ రీల్ షూట్ పెను ప్రమాదంకరం అని.. ఆమెని చూస్తే భయంగా అనిపిస్తుంది ఎవరికైనా..

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో అమ్మాయి ఎత్తైన కొండ అంచున కూర్చుని అక్కడ రీలు వేస్తున్నట్లు చూడవచ్చు. అమ్మాయి కూర్చున్న కొండ చివర చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. క్రింద లోతైన గుంట కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఆ యువతి హ్యాపీగా పోజులిస్తూ తన వీడియో తీసుకుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో @NeverteIImeodd అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు లక్షలాది మంది చూసి కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఒక యూజర్ ఇలా వ్రాశాడు, ‘ప్రజలు ఇలాంటి మూర్ఖపు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఒకరి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది.’ మరొకరు పొరపాటున పాదాలు జారితే మేడమ్ జీవితం ముగిసినట్లు భావించండి’ అని రాశారు. మరొకరు దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రీల్ అని పిలవవచ్చు’ అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..