ఇదేం పనిరా సామీ..! రైలు సాఫ్ చేయమంటే పట్టాలు పాడుచేస్తున్నావ్..
పరిశుభ్రత అంటే సేవ..అంతేగానీ,ఒక ప్రదేశాన్ని శుభ్రం చేసి మరొక ప్రదేశాన్ని మురికి చేయడం కాదు. కానీ, మన చుట్టుపక్కల చాలా మంది ప్రజలు తమ ఇంటి వ్యర్థాలను ఖాళీ స్థలంలో వేస్తుంటారు. అలాగే, రైల్వే ఉద్యోగులు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. అలాంటి వారి నిర్లక్ష్యం కారణంగా రైల్వే పట్టాలపై చెత్త కుప్పలు పేరుకుపోయే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తివివరాల్లోకి వెళితే...

సాధారణ ప్రజలు కూడా కదులుతున్న రైలు నుండి చెత్తను బయట పడవేయకూడదు. ఎందుకంటే ఇది పట్టాల దగ్గర నివసించే ప్రజలకు, పంట పొలాలకు హాని కలిగిస్తుంది. అయితే, ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక రైల్వే ఉద్యోగి స్వయంగా పట్టాలపై చెత్త మూటను విసిరేస్తూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్‌లో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియోలో ఒక రైల్వే ఉద్యోగిని చెత్తను పట్టాలపైకి విసేరేందుకు యత్నిస్తుండగా, ఒక ప్రయాణీకుడు వద్దని వారించాడు. అయినప్పటికీ అతడు చెత్త బుట్టలోని పాలిథిన్ బ్యాగ్ చెత్తను తీసి బయట విసిరేస్తాడు. వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు, వినియోగదారు తన వాదన గురించి కూడా క్యాప్షన్‌లో ప్రస్తావించారు. ప్రజలు ఇప్పుడు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
@abhiscosmoss ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, నేను నవంబర్ 4, 2025న సీల్దా అలీఘర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12987)లో ప్రయాణిస్తున్నప్పుడు, ఈ సంఘటన నా ముందు జరిగింది. నేను దానిని వీడియోలో రికార్డ్ చేసాను. బాధ్యతాయుతమైన రైల్వే ఉద్యోగి రైలు నుండి చెత్తను విసిరేస్తున్నట్లు వీడియోలో ఉంది అని పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
నేను అతన్ని అలా చేయకుండా ఆపి, నువ్వు రైలును శుభ్రం చేసి ఎందుకు చుట్టుపక్కల ప్రాంతాలను మురికి చేశావు? అని అడిగినప్పుడు, అతను వెటకారంగా సమాధానం చెప్పాడని అన్నాడు. నేను ఈ చెత్తను ఇంటికి తీసుకెళ్లాలా అంటూ ఎదురు ప్రశ్నించాడని చెప్పాడు. ఇది తప్పు, నువ్వు ఇలా చేయకూడదని నేను అతనికి వివరించడానికి ప్రయత్నించానని కూడా ఆ యూజర్ తెలిపాడు. కానీ, ఆ వ్యక్తి వినడానికి సిద్ధంగా లేడని అన్నాడు. ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




