AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Tips: ఇలా చేస్తే మీ మడమలు అస్సలు పగలవు.. పాదాలు అందంగా, మృదువుగా చేస్తుంది..!

శీతాకాలం తాజాదనాన్ని, చల్లదనాన్ని తెస్తుంది. కానీ, ఇది మన చర్మానికి, ముఖ్యంగా మన పాదాల చర్మానికి కూడా పెద్ధ సమస్యగా మారుతుంది. శీతాకాలంలో తేమ లేకపోవడం, చల్లని గాలులు మన పాదాల చర్మం పొడిగా, పగుళ్లురావడం, నిర్జీవంగా మారడానికి కారణమవుతాయి. ప్రజలు వివిధ క్రీములు, లోషన్లు వంటి ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. కానీ, ఇది సరిపోదు. సమస్య తిరిగి మళ్లీ మొదటికే వస్తుంది. మీరు కూడా చలికాలంలో పాదాల పగుళ్లు, నిర్జీవంగా కనిపించే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే మీ కోసమే ఈ కథనం. మీ పాదాలను తేమగా ఉంచడమే కాకుండా వాటిని మృదువుగా, అందంగా మార్చే ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Winter Tips: ఇలా చేస్తే మీ మడమలు అస్సలు పగలవు.. పాదాలు అందంగా, మృదువుగా చేస్తుంది..!
Care For Feet
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2025 | 7:16 AM

Share

శీతాకాలం తాజాదనాన్ని, చల్లదనాన్ని తెస్తుంది. కానీ, ఇది మన చర్మానికి, ముఖ్యంగా మన పాదాల చర్మానికి కూడా పెద్ధ సమస్యగా మారుతుంది. శీతాకాలంలో తేమ లేకపోవడం, చల్లని గాలులు మన పాదాల చర్మం పొడిగా, పగుళ్లురావడం, నిర్జీవంగా మారడానికి కారణమవుతాయి. ప్రజలు వివిధ క్రీములు, లోషన్లు వంటి ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. కానీ, ఇది సరిపోదు. సమస్య తిరిగి మళ్లీ మొదటికే వస్తుంది. మీరు కూడా చలికాలంలో పాదాల పగుళ్లు, నిర్జీవంగా కనిపించే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే మీ కోసమే ఈ కథనం. మీ పాదాలను తేమగా ఉంచడమే కాకుండా వాటిని మృదువుగా, అందంగా మార్చే ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

శీతాకాలంలో కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించటం వల్ల మీ పాదాలు అందంగా, మృదువుగా చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగల ప్యాక్‌ ఒకటి ఉంది. దీనికోసం వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు మాత్రమే అవసరం. బియ్యం పిండి, నిమ్మరసం, బాడీ వాష్, కొబ్బరి నూనె. వీటితో ఈ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.

ఇలా మాస్క్ తయారు చేసుకోండి:

ఇవి కూడా చదవండి

మీ పాదాలను మృదువుగా చేయడానికి, మీరు ఈ మాస్క్‌ను ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక చెంచా బియ్యం పిండి తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ చెక్క రసం పిండుకోవాలి. ఒక చెంచా బాడీ వాష్, రెండు చెంచాల కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ పదార్థాలను బాగా కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేయండి. దీన్ని ఇప్పుడు మీ పాదాలకు ప్యాక్‌లా వేసుకోవాలి.

మీ పాదాలకు ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందుగా మీ పాదాలను బాగా శుభ్రం చేసుకోండి. తరువాత, మాస్క్ ను మీ పాదాలకు అప్లై చేయండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. మాస్క్ ఆరిన తర్వాత పాదాలను శుభ్రంగా కడగాలి. చివరగా, ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. తరచూ ఇలా చేయటం వల్ల మీ పాదాలు అందంగా, మృదువుగా కనిపిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..