AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉసిరి మునగాకు జ్యూస్‌ తాగితే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో మ్యాజిక్‌ జరిగినట్టే..!

నారింజ కంటే 20శాతం ఎక్కువ విటమిన్ సి ఉసిరిలో ఉంటుంది. మునగ ఆకులలో కూడా విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఉసిరి-మునగ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేలరీలు తగ్గించి, ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి ఈ జ్యూస్ తాగవచ్చు.

ఉసిరి మునగాకు జ్యూస్‌ తాగితే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో మ్యాజిక్‌ జరిగినట్టే..!
Amla Moringa Juice
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2025 | 9:02 PM

Share

రోగనిరోధక శక్తిఉసిరిలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగలో జింక్, ఐరన్, విటమిన్ A ఎక్కువగా ఉంటాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. చర్మ సౌందర్యంఉసిరిలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండూ చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచుతాయి.

మునగాకులు షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి. ఉసిరి గ్లూకోజ్ లెవెల్స్‌ను రెగ్యులేట్ చేస్తుంది. తద్వారా డయాబెటిస్ ముప్పు రాకుండా కాపాడుకోవచ్చు. జుట్టుఉసిరి కురులను బలంగా మారుస్తుంది, చుండ్రును పోగొడుతుంది. మునగాకులో అమైనో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టును బలంగా, దృఢంగా మారుస్తాయి. కాలేయంఉసిరి కాలేయం పనితీరును మెరుగుపరచి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది.

మునగాకు మంచి క్లెన్సర్ మాదిరి పని చేస్తుంది. దీంతో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె ఆరోగ్యంఉసిరి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మునగాకు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ రెండూ కలిపి తాగితే గుండెను బలంగా ఉంచుకోవచ్చు. నీరసంఉసిరి,మునగాకు రసం తాగడం వల్ల నీరసం తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జీగా ఉండడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

తయారీ విధానంమిక్సీ జార్‌లో ఒక మీడియం సైజ్ ఉసిరికి అరస్పూన్ మునగాకు పొడి లేదా మునగాకు చొప్పున తీసుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, కొద్దిగా పసుపు, 2 మిరియాలు, కొన్ని నీళ్లు వేసి బ్లెండ్ చేయండి. ఈ రసాన్ని రోజూ ఉదయం తాగితే చాలా మంచిది. జీర్ణశక్తిఉసిరి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మునగాకులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు. ఉసిరి, మునగ ఆకులలోని కాల్షియం ఎముకలు, పళ్ళ ఆరోగ్యానికి మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఈ జ్యూస్ చర్మానికి మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!