AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటి చూపు మంద‌గించే ముందు కనిపించే లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారంటే..

ఇటీవల కాలంలో కంటి సంబంధిత స‌మ‌స్య‌లు తీవ్రంగా పెరుగుతున్నాయి. చాలా మంది చిన్న‌త‌నంలోనే కంటి చూపు తగ్గిపోవటం, సోడాబుడ్డి కళ్లాద్దాలు ధరించి కనిపిస్తున్నారు. కంటి చూపు మందగించడానికి కేవలం పోషకాహార లోపం మాత్రమే కారణం కాదు.. మీ రోజువారి అలవాట్లు, మీరు చేస్తున్న పనులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు ఎల్ల‌ప్పుడూ క‌నిపిస్తుంటే మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే క‌ళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, కొన్ని సార్లు చూపు కూడా కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. ముందుగా కంటి చూపు మందగిస్తుందని తెలిపే లక్షణాల గురించి తప్పక తెలుసుకోవాలి..అవేంటంటే..

కంటి చూపు మంద‌గించే ముందు కనిపించే లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారంటే..
Protect Your Eyes
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2025 | 5:12 PM

Share

మన శరీరంలో అత్యంత విలువైన భాగాలలో కళ్లు ఒకటి. అవి లేకుండా మనం ఈ అందమైన ప్రపంచాన్ని చూడలేం. కానీ, నేడు ప్రతిరోజూ చాలా సమయం మొబైల్ స్క్రీన్ చూస్తూ గడుపుతున్నాం, కాబట్టి కళ్ళపై ఒత్తిడి పెరుగుతోంది. అలాంటప్పుడు కళ్లు కొంతకాలానికి బలహీనంగా మారుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మీ కళ్లు బలహీనంగా మారాయని, కంటి చూపు తగ్గుతుందని ముందుగానే కొన్ని లక్షణాలు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అప్పుడప్పుడు అస్పష్టంగా కనిపించడం, దగ్గర లేదా దూరంగా ఉన్న వస్తువులు చూస్తే ఒక్కసారిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. నిరంతరం చదవడం లేదా ల్యాప్ టాప్, పీసీలు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా కళ్ళలో అలసటతో దురద అనిపిస్తుంది. లేదా కళ్లల్లో మంట, నొప్పి అనిపించడం కూడా కంటి చూపు మందగిస్తుందని చెప్పేందుకు సంకేతాలు.

తక్కువ వెలుగులో చూడటం మీకు మరీ కష్టమవుతుంది. అలాగే కళ్లలో నిరంతరం మంటగా ఉంటుంది. అంతేకాకుండా కళ్ళలో తేమ తగ్గడంతో దురదగా ఉంటుంది. కళ్లు మూసి ఉంచాలనిపిస్తుంది. డబుల్ ఇమేజ్ కనిపిస్తుంది. ఒక వస్తువు అకస్మాత్తుగా రెండుగా కనిపించడం, వస్తువు, ఫొటోగానీ అస్పష్టంగా కనిపించటం కూడా కంటి చూపు మందగిస్తుందనే చెప్పే సంకేతాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం మరింత తీవ్రంగా మారే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..