- Telugu News Photo Gallery Kiwi fruit side effects overconsumption can lead to 5 major health issues in telugu
Kiwi fruit : కివీ పండుతో జాగ్రత్త.. ఆరోగ్యం కోసమని అతిగా తిన్నారంటే..ఈ సమస్యలు తప్పవు!
కివీ.. దీని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. విటమిన్-సి తో పాటు అనేక పోషకాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది... అదేంటంటే.. ఆరోగ్యానికి మంచిదని అతిగా తిన్నారంటే..అంతే సంగతి అంటున్నారు నిపుణులు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఆరోగ్యకరమైనది కూడా విషంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి తింటే కివీ ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కివీ పండును ఎక్కువగా తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి..? ఎవరు దీనిని తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 07, 2025 | 9:19 PM

కివీ పండును ఎక్కువగా తినడం వల్ల నోరు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. కివీ పండులో ఉండే ఎంజైములు కొందరిలో నోరు, పెదవులు లేదా గొంతులో చికాకు లేదా మంట కలిగించవచ్చు. కివీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అధికంగా తింటే పొట్టలో గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వారానికి ఒకటి లేదా రెండు కివీ పండ్లకు మించి తినకూడదు. ముఖ్యంగా, పరగడుపున కివీ పండును అస్సలు తినకూడదు.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు కివీ పండు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కివీ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక రక్తపోటు కోసం మందులు తీసుకునేవారు ఎక్కువగా కివీ తింటే, వారి రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి సమస్యలు తలెత్తవచ్చు. అ

అలాగే, రక్తాన్ని పలుచబడే మందులు తీసుకునే వారు కూడా కివీ పండు తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. కివీలో రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉంటుంది, కాబట్టి మందులతో కలిపి తింటే సమస్యలు తీవ్రమవుతాయి.

కివీ తొక్కపై ఉండే చిన్న వెంట్రుకల లాంటి సూక్ష్మమైన నారలు కూడా కొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. కివీ పండుతో అలర్జీ ఉన్నవారు తొక్కను తాకినా, తిన్నా చర్మంపై చికాకు లేదా ఎరుపు రంగు దద్దుర్లు కనిపించవచ్చు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. కివీ ఎంత ఆరోగ్యకరమైనదైనా, దానిని మితంగా తీసుకోవడం మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కివీ పండు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.




