అదా అందాలకు ఫిదా అవ్వాల్సిందే.. నెమలి పించంలా మెరిసిన ముద్దుగుమ్మ
హాట్ బ్యూటీ అదా శర్మ. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. సినిమా కోసం ఎలాంటి సాహసాలు అయినా చేస్తుంది ఆ చిన్నది.
Updated on: Nov 07, 2025 | 9:19 PM

హాట్ బ్యూటీ అదా శర్మ. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. సినిమా కోసం ఎలాంటి సాహసాలు అయినా చేస్తుంది ఆ చిన్నది.

ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది.ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసింది.

బాలీవుడ్ లో లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా ముందుగా వివాదంలో చిక్కుకున్నప్పటికీ.. ఆతర్వాత ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అలాగే ఈ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది.

అదా శర్మ మొన్నామధ్య దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెలనెలా రెంట్ పే చేస్తుంది అదా శర్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.