వంకాయలోని ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..! ఆ సమస్యలన్నీ పరార్..
అన్ని కూరగాయలలో వంకాయది ప్రత్యేక స్థానం.. వంకాయతో చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు. దాదాపుగా అందరూ వంకాయ తినడానికి ఇష్టపడతారు. పైగా వంకాయ ప్రతి సీజన్‌లోనూ చౌకగా లభిస్తుంది. శీతాకాలంలో వంకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చలి రోజులలో దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కెర, గుండె జబ్బులు కూడా నియంత్రణలో ఉంటాయి. వంకాయలో విటమిన్లు, ఫినోలిక్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇంకా, వంకాయను అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కాబట్టి, వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంది. పలు రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చెక్ పెట్టొచ్చు. వంకాయ తినడం వల్ల మెదడు మెరుగుపడటమే కాకుండా జ్ఞాపకశక్తికి కూడా పదును పెడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంకాయలో ఆంథోసైనిన్, నాసునిన్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది మెదడు కణాలను నిర్విషీకరణ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందుకే మెదడు పెరుగుతుంది. మానసిక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. వంకాయలో ఫైటోన్యూట్రియెంట్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది మెదడును పదునుపెడుతుంది. మెదడు వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
వంకాయ తినటం వల్ల గుండె సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణమయ్యేవాటి నుంచి కాపాడుతుంది. వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వంకాయ తీసుకోవటం వల్ల గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో వంకాయను చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందొచ్చు.
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు ముప్పును తగ్గిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. వంకాయ తినడం బరువు తగ్గడానికి చాలా మంచిది. ఇది కొవ్వు బర్నింగ్ రేటును మరింత పెంచుతుంది.
వంకాయ తినడం వల్ల మెదడు పదును పెట్టడమే కాకుండా ఎముకలు కూడా బలపడతాయి. వంకాయలో ఫినాలిక్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది శరీర సాంద్రతను పెంచడానికి సహాయపడుతుంది. వంకాయ తినడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..







