AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ 30 గుంజీలు తీయండి..! ఇదేదో పనిష్మెంట్‌ కాదండోయ్.. ఆరోగ్య లాభాలు తెలిస్తే ఆగకుండా చేసేస్తారు..

గుంజీలు తీయడం వల్ల పొత్తికడుపు, కాళ్ల కండరాలు బలంగా మారతాయి. బరువు తగ్గడం, వెన్నెముక నొప్పి నివారణ, జీర్ణక్రియ మెరుగు, గుండె ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు 30 గుంజీలు తీయడం ద్వారా అథ్లెటిక్ శరీరాకృతిని పొందవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శ్వాసకోశ సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడానికి గుంజీలు ఉత్తమ మార్గం.

రోజూ 30 గుంజీలు తీయండి..! ఇదేదో పనిష్మెంట్‌ కాదండోయ్.. ఆరోగ్య లాభాలు తెలిస్తే ఆగకుండా చేసేస్తారు..
Squats
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2025 | 9:58 PM

Share

గుంజీలు తీయడం వల్ల పొత్తి కడుపు, కాళ్ల కండరాలు బలంగా మారతాయి. ఏదైనా బరువు ఎత్తుతూ గుంజీలు తీస్తే చేతులు కూడా బలంగా తయారవుతాయి. కండలు పెరుగుతాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిలో వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. అలాంటి వారు రోజూ 30 గుంజీలు తీయడం చాలా మంచిది. ఈ సమయంలో శరీరాన్ని సరైన భంగిమలో ఉంచాలి. తద్వారా మీ బాడీ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. గుంజీలు తీయడం ద్వారా పొత్తి కడుపు, పేగు కండరాలు బలంగా, ఆరోగ్యంగా మారతాయి. తద్వారా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

వెన్నునొప్పి సమస్య రాకుండా కాపాడటంలో గుంజీలు సహాయపడతాయి. ప్రతిరోజూ గుంజీలు తీయడం వల్ల వెన్నెముక బలంగా తయారవుతుంది. తద్వారా వెన్నునొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. గుంజీలు తీయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరిగించుకోవచ్చు. తద్వారా రక్తపోటు అదుపులో ఉంచి, గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వయసు పెరిగినా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

అధిక బరువు సమస్య రాకుండా ఉండాలంటే గుంజీలు తీయడం చాలా మంచిది. రోజూ 30 గుంజీలు తీస్తే మెటబాలిజం రేటు మెరుగుపడి కేలరీల ఖర్చు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గవచ్చు. కొంతమందికి తొడ, పిరుదుల వద్ద కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు గుంజీలు తీయడం ద్వారా ఆ ప్రాంతంలోని కొవ్వు సులువుగా కరిగిపోతుంది. మంచి ఆకృతి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మీరు మీ బాడీని అథ్లెట్‌లాగా ఉంచుకోవాలంటే బాడీ బ్యాలెన్స్, బాడీ స్టెబిలిటీ, బాడీ పవర్, బాడీ కో ఆర్డినేషన్ అన్నీ బాగుండాలి. గుంజీలు తీయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. దీంతో అథ్లెట్ లాంటి పవర్, బాడీని పొందవచ్చు. అంతేకాదు.. గుంజీలు తీసే సమయంలో శ్వాస ప్రక్రియ మరింత ఎక్కువగా జరపాల్సి వస్తుంది. దీంతో ఊపిరితిత్తులు గాలి తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. శ్వాస సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్