AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆర్డర్‌ రాగానే ఆతృతగా తిన్నారు.. కాసేపటికే ప్లేట్‌లో కనిపించింది చూసి.. వ్యాక్‌..

ఒక కుటుంబ సరుదాగ బయట భోజనం చేద్దామని ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. కావలసినవన్ని ఆర్డర్ ఇచ్చారు. రెస్టారెంట్ చూడడానికి కలర్ ఫుల్‌గా ఉంది.. కానీ టేబుల్ పైకి వచ్చిన ఆహారం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఫుడ్‌ తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకు ఆఫుడ్‌లో వాళ్లకు ఏం కనిపించింది. వాళ్లు ఎందుకు ఫుడ్‌ తినలేదు తెలుసుకుందాం పదండి.

Watch Video: ఆర్డర్‌ రాగానే ఆతృతగా తిన్నారు.. కాసేపటికే ప్లేట్‌లో కనిపించింది చూసి.. వ్యాక్‌..
Karimnagar Food Safety
G Sampath Kumar
| Edited By: Anand T|

Updated on: Nov 09, 2025 | 1:12 PM

Share

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ సమీపంలో ఉన్న మైత్రి రెస్టారెంట్ కి వేములవాడకు చెందిన రాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. వెయిటర్ రాగానే కావలసిన ఫుడ్ కోసం ఆర్డర్ తీసుకున్నాడు. రోటితోపాటు ఇతర కర్రీస్, వెజిటేబుల్ రైస్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. అయితే వెజిటేబుల్ రైస్ రెండు స్పూన్లు తిన్న తర్వాత అందులో ఒక బొద్దింక దర్శనం ఇచ్చింది. ఇది చూసిన కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు బొద్ధింకతో పాటు అక్కడక్కడ వెంట్రుకలు కూడా కనబడ్డాయి. దీంతో రాజు కుటుంబ సభ్యులు వెంటనే ఆఫుడ్‌ను అక్కడే వదిలేశారు.

హోటల్ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి నిలదీశారు. కానీ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో రాజు వెంటనే ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు కాల్‌ చేశాడు. అయితే వారు కూడా సరిగ్గా స్పందించలేదని బాధితులుడు వాపోయాడు. అధికారులు స్పందించి ఈ రెస్టారెంట్ పైన చర్యలు తీసుకోవాలని రాజు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి ఆహారం తిందారమంటే భయమేస్తుందని. ఓవైపు కల్తీ పదార్థాలతో ఆహారం తయారీ, మరోవైపు అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించిన రెస్టారెంట్లు, హోటల్ల తీరు మారడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే ఆహారం అందిస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యాంగ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. గతంలో కూడా రెండు మూడు హోటలలో బొద్ధింకలతో పాటు ఈగలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైకి చూడడానికి రెస్టారెంట్లు నీట్ గా కనబడినప్పటికీ కిచెన్ లో మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో రెస్టారెంట్లకు హోటళ్లకు వెళ్లాలంటే వినియోగదారులు భయపడుతున్నారు.

ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి నిరంతరం తనిఖీలు చేసి శుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మైత్రి రెస్టారెంట్ తీరుపైన రాజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధిక రేట్లు వసూలు చేసినప్పటికీ కనీసం ఎలాంటి ప్రమాణాలు పాటించకుండానే ఫుడ్ ని తయారు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాజు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.