AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: దైవ దర్శనానికి వెళ్తుండగా.. వెంటాడిన మృత్యువు.. తృటిలో తప్పించుకున్న కుటుంబం!

దైవ దర్శనానికి వెళ్తుండగా ఓ కుటుంబానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. కారు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లోనే ఊహించని ఘోరం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో కారులోని ఉన్నవారందరూ మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూలు జిల్లా ఈగటపెంట వద్ద చోటుచేసుకుంది.

Watch: దైవ దర్శనానికి వెళ్తుండగా.. వెంటాడిన మృత్యువు.. తృటిలో తప్పించుకున్న కుటుంబం!
Mahabubnagar
Boorugu Shiva Kumar
| Edited By: Anand T|

Updated on: Nov 09, 2025 | 11:05 AM

Share

దైవ దర్శనానికి వెళ్తుండగా ఓ కుటుంబానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. కారు రన్నింగ్‌లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును పక్కకు ఆపేసి లోపల ఉన్న వారికి దించేశాడు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంట సమీపంలో గతరాత్రి ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దగ్ధం కావడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని చిక్కడపల్లికి చెందిన ఆకుల ప్రణవ్ కుమార్ తన ఐదుగురి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో ఇంటి నుంచి మొదలైన కారు ప్రయాణం శ్రీశైలానికి కొద్ది దూరంలో అనుకోని ప్రమాదానికి గురైంది. ఈగలపెంట సమీపంలో ఒక్కసారిగా కారు ముందు భాగం నుంచి పోగ రావడాన్ని ప్రణవ్ గమనించాడు. దీంతో వెంటనే రోడ్డుపై కారును ఆపి కుటుంబ సభ్యులను వెంటనే కారు నుంచి దింపేశాడు. అందరూ కారుకు దూరంగా వెళ్లిపోయారు. ఇంతలోనే పొగలు కాస్త మంటలుగా మారాయి. క్షణాల్లోనే ఆ మంటలు పూర్తిగా కారు మొత్తం వ్యాప్తించాయి.

దీంతో ప్రణయ్‌ వెంటనే పోలీసుకుల సమాచారం ఇచ్చాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న జెన్‌కో కు చెందిన ఫైర్ ఇంజిన్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే చూస్తుండగానే కారు ఆగ్నికి ఆహుతై… బూడిదలా మారిపోయింది. ఇక ఈ ఘటన హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై జరగడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇక అప్పటివరకు ప్రయాణించిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, దగ్ధం కావడం పట్ల ప్రయాణికులు షాక్ కు గురయ్యారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న పెను ప్రమాదం సంభవించేదని భయాందోళనకు గురయ్యారు. అయితే కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై