AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మాయరోగం..! మూత్రనాళంలో పెన్సిల్.. ఖైదీకి తప్పిన ప్రాణాపాయం

ఖైదీని మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి పెన్సిల్‌ను తొలగించడంతో ఖైదీ ప్రాణాపాయం తప్పింది. మూత్ర విసర్జనలో ఆటంకం, తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వైద్యులు తెలిపారు. మంట, దురదతో అలా చేశానని ఖైదీ చెప్పాడు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ చేపట్టారు.

ఇదెక్కడి మాయరోగం..! మూత్రనాళంలో పెన్సిల్.. ఖైదీకి తప్పిన ప్రాణాపాయం
Emergency Surgery
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2025 | 10:23 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్ సెంట్రల్ జైలులో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఒక ఖైదీ తన మూత్రనాళంలో మంట, దురదగా ఉందని అధికారులకు చెపుకుని బోరుమన్నాడు. జైలు అధికారులు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ బాధిత ఖైదీని పరీక్షించిన డాక్టర్లు అతని మూత్రనాళంలో 9 సెంటీమీటర్ల పెన్సిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి పెన్సిల్‌ను తొలగించడంతో ఖైదీ ప్రాణాపాయం తప్పింది. మూత్ర విసర్జనలో ఆటంకం, తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వైద్యులు తెలిపారు. మంట, దురదతో అలా చేశానని ఖైదీ చెప్పాడు. ఈ ఘటనపై జైలు అధికారులు విచారణ చేపట్టారు.

నివేదికల ప్రకారం, సెంట్రల్ జైలులో హత్య నిందితుడైన ఖైదీ మంగళవారం అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రి జైలు వార్డులో చేర్చారు. అతని మూత్ర నాళం వాపు, రక్తస్రావం అయింది. వైద్యులు అతన్ని పరీక్షించగా అతని మూత్ర నాళంలో పెన్సిల్ ఇరుక్కుపోయి ఉందని కనుగొన్నారు.

మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు వైద్యుల బృందం ఖైదీకి శస్త్రచికిత్స చేశారు. 3-4 గంటల విజయవంతమైన శస్త్రచికిత్స తర్వాత, ఖైదీ ప్రాణాలను కాపాడారు. వైద్యులు అతని మూత్ర నాళం నుండి 9 సెంటీమీటర్ల పొడవున్న పెన్సిల్‌ను తొలగించారు. పెన్సిల్ అతని మూత్ర నాళంలో ఇరుక్కుపోవడం వల్ల, ఖైదీ మూత్ర విసర్జన చేయలేకపోయాడు. అతని పరిస్థితి క్షీణిస్తోంది. ఆపరేషన్ తర్వాత అతని పరిస్థితి వేగంగా మెరుగుపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
షెఫాలీ, జెమిమా అట్టర్ ఫ్లాప్..ముంబై చేతిలో ఢిల్లీ ఘోర పరాజయం
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
కారు టైర్ల కింద నలిగిపోయిన కుక్కపిల్ల.. క్రూరంగా చంపేసిన..
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కావాలా? అయితే ఇలా చేస్తే అన్నీ శుభాలే
కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?
కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?