Viral Video: ఈ చిలుక మహా గడుసరి సుమీ.. రావణుడిగా నవ్వేస్తుంది.. మిమ్మల్ని నవ్విస్తుంది..
చిలుక పలుకులు గురించి తెలుసు.. ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఇంట్లో సందడి చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక చిలుక రావణుడిలా నవ్వుతుంది. మీరు నమ్మకపోతే మీరే చూడండి. ఈ వైరల్ వీడియోలో ఒక చిలుక మీరు ఊహించలేని ప్రతిభను ప్రదర్శించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో.. చిలుక రావణుడిలా నవ్వుతూ కనిపిస్తుంది. పక్షి ఇవన్నీ చేసే విధానం ఎవరనైనా నవ్విస్తుంది.

మీరు ఎప్పుడైనా చిలుక నవ్వడం చూశారా? లేకపోతే ఇప్పుడే చూడండి. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అందులో ఒక చిలుక రావణుడిలా నవ్వుతూ కనిపిస్తుంది. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. దీంతో నెటిజన్లు దీన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసి తమ నవ్వును తామే నియంత్రించుకోలేకపోతున్నారు. ఈ పక్షి మాట్లాడే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిందని తెలిసిందే. దీని ప్రత్యేకత ఏమిటంటే అది ఏదైనా పదాన్ని పదే పదే వింటే.. ఆ పదాన్ని ఆ చిలుక మళ్ళీ పలుకడం మొదలు పెడుతుంది. చాలా ఇళ్లలో ఇష్టంగా చిలుకని పెంచుకుంటారు. అంతేకాదు చిలుక పలుకులు, చేసే పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతున్నాయి. వీటిలో మీరు చిలుకలు మనుషుల్లా మాట్లాడటం చూసి ఉంటారు.
అయితే ఇప్పుడు వైరల్ అయిన ఒక వీడియోలో.. ఒక చిలుక ఎవరూ ఊహించలేని విధంగా తన ప్రతిభను ప్రదర్శించింది. @passaros.exoticosbr అనే హ్యాండిల్ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో చిలుక రావణుడిలా నవ్వుతూ కనిపిస్తుంది. పక్షి ఇలా చేసే విధానం మిమ్మల్ని కూడా నవ్విస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 2 లక్షల 81 వేలకు పైగా లైక్ చేశారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ తో సందడి చేస్తున్నారు.
వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
ఒక నెటిజన్ స్పందిస్తూ… ఇలా వ్యాఖ్యానించారు, “ఈ చిలుక చాలా బిగ్గరగా నవ్వుతుంది.” మరొకరు తాను మొదటిసారిగా ఒక చిలుక మనిషిలా నవ్వడం చూస్తున్నానని కామెంట్ చేశాడు. మరొక యూజర్ ఇలా అన్నాడు, “ఓ భాయ్ సాబ్! అలాంటి చిలుక ఎక్కడ దొరుకుతుంది? నాకు కావాలి.. ఎవరైనా దయచేసి నాకు కూడా ఒకటి తీసుకురండి అంటూ తనకు చిలుక పట్ల ఉన్న ప్రేమని తెలియజేశాడు. మొత్తం మీద ఈ చిలుక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంలో పూర్తిగా విజయవంతమైంది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. చిలుక ప్రత్యేక ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




