AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘ఇన్​స్టాలో ఇద్దరు ఫాలోవర్స్ తగ్గారు’ – భర్తపై భార్య పోలీస్ కంప్లైంట్

ప్రస్తుతం సోషల్ మీడియా మేనియా ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మంచి కంటే దీని వల్ల చెడే ఎక్కువ జరుగుతుంది. కొంతమంది రీల్స్, వీడియోలు, ఫాలోవర్స్ కోసం పిచ్చి పనులు చేస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఎందాక అయినా సై అంటున్నారు. మరికొందరు యువతుల్ని ట్రాప్ చేయడానికి ఈ వేదికల్ని ఉపయోగిస్తున్నారు. ఇంకొందరు అయితే ఈ రీల్స్ మాయలో పడి కుటుంబాల్నే పట్టించుకోవడం లేదు. తాజాగా ఝార్ఖండ్‌లో ఇలాంటి ఓ ఘటన వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు ఫాలోవర్స్ తగ్గారని భర్తపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Viral:  'ఇన్​స్టాలో ఇద్దరు ఫాలోవర్స్ తగ్గారు' - భర్తపై భార్య పోలీస్ కంప్లైంట్
Instagram Dispute
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2025 | 12:23 PM

Share

పోలీసుల వివరాల ప్రకారం.. హాపుర్ జిల్లా పిల్ఖువా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువతి గౌతమ్ బుద్ధ నగర్‌లోని దాద్రికి చెందిన యువకుడిని కొద్ది నెలల క్రితం మ్యారేజ్ చేసుకుంది. వివాహానంతరం చిన్నచిన్న కారణాలతో వారి మధ్య విభేదాలు తలెత్తడంతో.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా భర్తపై పిల్ఖువా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. భార్యాభర్తలిద్దరినీ కౌన్సిలింగ్ కోసం పోలీసుల వద్దకు పిలిపించగా.. ఆమె తెలిపిన కారణాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయి.

భర్త వెర్షన్ విషయానికి వస్తే.. భార్య ఇంటి పనులు చేయకుండా ఎప్పుడూ రీల్స్ తీస్తూ బిజీగా ఉంటుందట. ఫాలోవర్స్ తగ్గినప్పుడల్లా తనకు ఫుడ్ కూడా పెట్టడం లేదని భర్త ఆరోపించాడు. ఇక భార్య వెర్షన్‌కు వస్తే.. భర్త తరచూ ఇంటి పనులు చేయమని చెబుతుంటాడని.. ఆ సమయంలో రీల్స్ అప్‌లోడ్ చేయలేక తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు ఫాలోవర్స్ తగ్గారని తెలిపింది. సుమారు 3-4 గంటల కౌన్సిలింగ్ తర్వాత భార్య భర్తకు రోజూ రెండు రీల్స్ మాత్రమే చేస్తానని హామీ ఇచ్చింది. భర్త కూడా అందుకు అంగీకరించాడు.

“సోషల్ మీడియాలో భార్య ఎక్కువ సమయం గడపడం.. ఇంటి పనులు పట్టించుకోకపోవడం వల్ల గొడవలు జరిగినట్లు తెలిసింది. కౌన్సిలింగ్ అనంతరం ఇద్దరూ తమ తప్పులను అంగీకరించి.. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు” అని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..