మీరు సూపరండి బాబూ.. 40 ఏళ్ల డాక్టర్.. 20 ఏళ్ల కుర్రాడిలా మారిపోయారు.. ఎలానో తెలుసా..
40 ఏళ్ల డాక్టర్.. 20 ఏళ్ల కుర్రాడిలా మారిపోయారు. లండన్ చెందిన ఆ డాక్టర్ మూడు కీలక సప్లిమెంట్ల సీక్రెట్‌ను రివీల్ చేసి హాట్‌టాపిక్ అయ్యారు. ఇంతకీ.. ఎవరా డాక్టర్?... కుర్రాడిలా మారిపోయేలా చేసిన ఆ మూడు కీలక సప్లిమెంట్లు ఏంటి?... డాక్టర్ ఏం చెప్పారు.. ఈ వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

సాధారణంగా 41 ఏళ్లు వచ్చేసరికి చాలామంది మధ్య వయస్సుతో అలసటకు గురవుతుంటారు. కానీ.. ఇదిగో ఈ ఫొటోలోని మహమ్మద్ ఇనాయత్ అనే లండన్‌కు చెందిన ఓ ప్రైమరీ కేర్ డాక్టర్ మాత్రం అలాంటి అంచనాలను తారుమారు చేశారు. ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటూ తన వయస్సును 24 ఏళ్లుగా మార్చుకుని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అతని ఒరిజినల్ ఏజ్ 41 ఏళ్లు కాగా.. దానిని 17 ఏళ్లు తగ్గించుకుని యంగ్ డైనమిక్‌గా ప్రచారంలోకి వచ్చారు. అయితే.. ఈ మార్పులకు కారణం మాత్రం తాను తీసుకునే ఆహారమేనంటూ ఫుడ్ సీక్రెట్‌ను రివీల్ చేశారు డాక్టర్ ఇనాయత్. కేవలం ఫుడ్‌తోపాటు.. రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ, వ్యక్తిగత జీవనశైలిలోనే మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. డాక్టర్ ఇనాయత్ తన శరీరాన్ని ఏడేళ్లుగా ఒక డేటా ల్యాబ్‌గా మార్చుకున్నారు. ప్రత్యేక ఆహారం తీసుకోవడంతోపాటు.. నిద్రపోవడం, మేల్కోవడం లాంటి రోజువారీ కార్యకలాపాల కోసం ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించారు. తరచూ వివిధ రకాల టెస్టులు చేయించుకుంటూ లైఫ్‌ను ట్రాక్ చేసుకుంటూ వచ్చారు.
ప్రధానంగా.. ఫోలేట్‌తో కూడిన బీకాంప్లెక్స్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను రోజువారీగా వాడినట్లు మహమ్మద్ ఇనాయత్ తెలిపారు. ఆయా సప్లిమెంట్లు ఎందుకు వాడాల్సి వచ్చిందో కూడా వివరించారు. తనకు మిథైలేషన్ జన్యులోపం కారణంగా పోలేట్‌తో కూడిన బీకాంప్లెక్స్ వాడినట్లు చెప్పారు. వీటి వినియోగంతో మానసిక స్థితి మెరుగుపడి.. మెదడు ఆరోగ్యం పనిచేస్తుందన్నారు డాక్టర్ ఇనాయత్.
అలాగే.. కండరాల నొప్పి.. నిద్రలేమికి విరుగుడుగా మెగ్నీషియం తీసుకున్నట్లు తెలిపారు. ఇక.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు గాను ఒమేగా-3ని వినియోగించినట్లు తెలిపారు. మొత్తంగా.. ప్రత్యేక సప్లిమెంట్ల ద్వారా 17ఏళ్ల ఏజ్‌ను తగ్గించుకున్న లండన్ డాక్టర్ ఇనాయత్ నేచర్ ఏజింగ్ అధ్యయనం ఆసక్తి రేపుతోంది. ఇనాయత్ లండన్‌లోని HUM2N లాంగ్వేజ్ క్లినిక్ వ్యవస్థాపకుడుగా.. అలాగే.. ప్రాథమిక సంరక్షణ వైద్యుడిగా.. సేవలందిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




