ఉగ్రవాద శిక్షణలో చిన్నారులు.. తుపాకీ పట్టుకోవడంలో చిన్నతనం నుంచే తర్ఫీదు!
పాకిస్థాన్ బుద్ధి మారలేదు. ఆ దేశం వాళ్ల అభివృద్ధిని మరిచి పక్క దేశాన్ని ఎలా నాశనం చేయాలనే ఆలోచనలే ఎక్కువగా చేస్తుందనేది అందరూ బహిరంగంగానే చెప్పే మాట. ఇక్కడ కనిపిస్తున్న వీడియో కూడా అందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఆ వీడియోలో కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే ఎలా ఉగ్ర చర్యలకు పాల్పడాలి, శత్రువులు ఎదురుతిరిగితే ఎలా ప్రవర్తించాలనే విషయాలను నేర్పిస్తున్నట్లుగా ఉంది.

శత్రుదేశం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే మాట ఎన్నో ఏళ్ల నుంచి నిరూపితం అవుతూనే ఉంది. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కూడా ఆ కోవకే చెందుతుంది. ఆ ఉగ్రదాడిలో ఎంతో మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. కాశ్మీర్ అందాలను ఆస్వాదిద్దామని, ఆ అనుభవాలను జ్ఞాపకాలుగా మలుచుకుందామని ఎన్నో ఆశలతో వెళ్లిన ఎందరో భారతీయులు విగత జీవులుగా తిరిగొచ్చారు. పాక్ అరాచకాలకు అంతే లేకుండా పోయిందని, ఎలాగైనా ఈ ఉగ్ర చర్యలను సమూలంగా రూపు మాపాలని భారత ప్రభుత్వం కూడా గట్టి ప్రణాళికలే వేసింది. అందులో భాగంగానే పాకిస్థాన్ దేశంపై ఎదురుదాడికి దిగి పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.
అయినా పాకిస్థాన్ బుద్ధి మారలేదు. ఆ దేశం వాళ్ల అభివృద్ధిని మరిచి పక్క దేశాన్ని ఎలా నాశనం చేయాలనే ఆలోచనలే ఎక్కువగా చేస్తుందనేది అందరూ బహిరంగంగానే చెప్పే మాట. ఇక్కడ కనిపిస్తున్న వీడియో కూడా అందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఆ వీడియోలో కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే ఎలా ఉగ్ర చర్యలకు పాల్పడాలి, శత్రువులు ఎదురుతిరిగితే ఎలా ప్రవర్తించాలనే విషయాలను నేర్పిస్తున్నట్లుగా ఉంది. ప్రధానంగా పాక్ ప్రభుత్వానికి అక్కడి ఉగ్రవాదులతో మంచి సంబంధాలు లేవని, అందుకే ప్రభుత్వాన్ని బేఖాతరు చేసి ఇలా టెర్రరిస్టులు అడ్డూ అదుపు లేకుండా మారణహోమానికి ప్రణాళికలు రచిస్తుంటారనే విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తాజాగా బయటికి వచ్చిన వీడియోని గమనిస్తే.. మదర్సా శిబిరంలో పాక్(JuD/LeT) పిల్లలకు తుపాకులు పట్టుకోవడానికి శిక్షణ ఇస్తున్నట్లు మనం చూడొచ్చు. అందులో చుట్టూ ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్లు అసలు సరిగా లోకజ్ఞానం కూడా తెలియని వయసులో ఉన్నట్లు చూస్తేనే అర్థమవుతోంది. ఆ పిల్లలు ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా శత్రువుని ఎదుర్కోవాలనే విషయంపై శిక్షణ పొందుతున్నారు. అంటే అంత చిన్న వయసు నుంచే పాకిస్థాన్ అక్కడి వాళ్లకు ఉగ్రవాదాన్ని నూరి పోస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..