Broccoli Benefits : ఈ కూరగాయ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్.. తరచూ తింటే ఇలాంటి సమస్యలన్నీ ఫసక్..!
కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో బ్రోకలీ ఒకటి.. ఇది క్యాబేజీ కుటుంబానికి చెందినది.. ఇవి మార్కెట్‌లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్లతో లభిస్తాయి. ఈ కలర్‌ఫుల్ బ్రోకలిలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. అయితే, బ్రోకలి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

మంచి ఆరోగ్యం కోసం మన రోజు వారి ఆహారంలో అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే, కూరగాయల విషయానికి వస్తే.. కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో బ్రోకలీ ఒకటి.. ఇది క్యాబేజీ కుటుంబానికి చెందినది.. ఇవి మార్కెట్‌లో రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్లతో లభిస్తాయి. ఈ కలర్‌ఫుల్ బ్రోకలిలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. అయితే, బ్రోకలి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
బ్రోకలి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఇది వ్యతిరేకంగా పోరాడుతుంది. బ్రోకోలిలో విటమిన్ కే, క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలం పరుస్తుంది. అంతేకాదు వయస్సురీత్యా వచ్చే ఆస్టియోపోరోసిస్ నుంచి ఇది దూరంగా ఉంచుతుంది. బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవన్నీ హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి.
చర్మ ఆరోగ్యానికి బ్రోకలీ నుండి యాంటీ ఆక్సిడెంట్లు తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి. బ్రోకోలి నొప్పుల సమస్యను కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా దూరంగా ఉంచుతుంది. బ్రోకోలి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కాలేయం కూడా క్లీన్ అయిపోతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..