Dreams About Snakes : తరచూ కలలో పాములు కనిపిస్తున్నాయా..? ఏం జరుగుతుందో తెలిస్తే..
పాములు కలలో కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..? జ్యోతిశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం..కలలో పాములు రావడం వెనకాల కొన్ని రహస్యాలు ఉన్నాయి. కలలో పాము కనిపించి అది నెమ్మదిగా మీ మంచంపై కిందకి వెళ్లిపోతే.. స్వప్న శాస్త్రం ప్రకారం..కలలో పాములు కనిపించటం గురించి ఏం చెబుతోందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సాధారణంగా పాములంటే అందరికీ భయమే..ఇక కొందరికైతే పాము పేరేత్తినా, పామును నేరుగా చూసినా ప్రాణ భయంతో అమడ దూరం పారిపోతుంటారు. అలాంటిది కొంతమందికి రాత్రిళ్లు కలలో పాములు వస్తున్నాయని తెగ భయపడిపోతుంటారు. పాములు కలలో కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..? జ్యోతిశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం..కలలో పాములు రావడం వెనకాల కొన్ని రహస్యాలు ఉన్నాయి. స్వప్న శాస్త్రం ప్రకారం..కలలో పాములు కనిపించటం గురించి ఏం చెబుతోందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం అంటున్నారు జ్యోతిశాస్త్ర పండితులు. కలలో పాము కనిపించటం వలన మీకు త్వరలో ఆకస్మిక ధన లాభం కలుగబోతోందనడానికి సూచనగా చెబుతున్నారు. అంతేకాదు, మీకు సంతానం కలుగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు అంటున్నారు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం అంటున్నారు.. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా కలలో పాము కనిపిస్తుందని చెబుతున్నారు.
అదే విధంగా కలలో పాము కనిపించి అది నెమ్మదిగా మీ మంచంపై కిందకి వెళ్లిపోతే అప్పుడు మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేనట్టవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..అదే మీ కలలో కనిపించిన పాము తల నుంచి తోక వరకు మొత్తం కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలని అంటున్నారు. కలలో ఎప్పుడైనా గుడిలో పాము ఉన్నట్లు కనిపిస్తే చాలా అద్భుతమైన రాజయోగానికి సంకేతం అంటున్నారు. అలాగే, ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించినా కూడా చాలా మంచిదంటున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..