Green Almond: ఆరోగ్య నిధి.. పచ్చి బాదంపప్పు ప్రయోజనాలు తెలిస్తే..వెతికి మరీ తెచ్చుకుంటారు..
బాదంపప్పును రోజుకు 7, 8 తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. కానీ, పచ్చిబాదం కాయలు కూడా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బాదం పప్పు జెల్‌లాగా సుతిమెత్తగా ఉంటుంది. రుచిలో కాస్త తియ్యగా, పులుపుగా, వగరుగా ఉంటుంది. అయితే, ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనేకం అంటున్నారు నిపుణులు. పచ్చి బాదం పప్పులు తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 11, 2025 | 4:31 PM

పచ్చిబాదంలోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఎండిన బాదం కంటే కూడా పచ్చి బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పచ్చి బాదంపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది.

పచ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.

పచ్చి బాదంలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా రక్షిస్తుంది. పచ్చిబాదంలో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

పచ్చి బాదం తినటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి పచ్చిబాదం ఎంతో మేలు చేస్తుంది. దీంతోపాటు గుండె పోటు రాకుండా రక్షిస్తుంది. పచ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ అధికంగా ఉండి చర్మం, జుట్టు సంరక్షణకు మేలు చేస్తుంది.




