Watch: ఓరీ దేవుడో.. ఒక్క పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ధర రూ. 2300లు..ఈ తండ్రి కథ వింటే..
ఒక తండ్రి, తన చిన్నారి కూతురి ఈ కథ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. గాజాలో నివసిస్తున్న ఒక పాలస్తీనా తండ్రి తన కుమార్తె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి అసాధారణ ప్రయత్నం చేశాడు. తనకు తలకు మించిన భారం అయినప్పటికీ రూ.2,300కి పార్లే-జి బిస్కెట్ల ప్యాక్ కొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు తమ కడుపు నింపుకోవడం కూడా కష్టంగా మారింది.. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భారతదేశంలో రూ.5కు లభించే పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ ధర ఇక్కడ రూ.2300కి చేరుకుంది. అవును, ఈ షాకింగ్ ఘటకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఒక తండ్రి, తన చిన్నారి కూతురి ఈ కథ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. గాజాలో నివసిస్తున్న ఒక పాలస్తీనా తండ్రి తన కుమార్తె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి అసాధారణ ప్రయత్నం చేశాడు. తనకు తలకు మించిన భారం అయినప్పటికీ రూ.2,300కి పార్లే-జి బిస్కెట్ల ప్యాక్ కొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్ వ్యక్తి మొహమ్మద్ జావాద్ తన కుమార్తె రఫీక్ ఫోటో, వీడియోను సోషల్ మీడియా ఇన్‌స్టా లో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఆ చిన్నారి పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌ను పట్టుకుని తింటుండటం కనిపిస్తుంది. జావాద్ దానిని 24 యూరోలకు (సుమారు రూ. 2,342) కొన్నానని చెప్పాడు. తన కూతురికి ఇష్టమైన బిస్కెట్లు చాలా ఖరీదైనవి అయినప్పటికీ, వాటిని కొనకుండా ఉండలేమని జావాద్ చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను నా కూతురికి ఇష్టమైన బిస్కెట్‌లను కొనివ్వగలిగాను అంటూ చెప్పాడు.. అయితే, ధర 1.5 యూరోలు ఉండగా (సుమారు రూ. 147) నుండి 24 యూరోలకు పెరిగిందని చెప్పాడు.
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025
గాజాలో చాలా కాలంగా జరుగుతున్న యుద్ధం కారణంగా, పిండి, బియ్యం, బంగాళాదుంపల ధరలు బాగా పెరిగాయి. హమాస్, ఇజ్రాయెల్ దళాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…