AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమకు ప్రతిరూపం ఈ జీవులు.. ఒకసారి జతకడితే మరణమే వీటిని విడదీయాలి..

జీవిత భాగస్వామిని ఒకసారి ఎంచుకుని జత కడితే తమ ప్రేమకి కట్టుబడి ఉండే జీవుల గురించి మీకు తెలుసా.. అవును మనిషిలో లోపిస్తున్న ప్రేమ, విశ్వాసం గురించి .. తమ జీవిత భాగస్వామిని మోసం చేయడమే కాదు ఏకంగా చంపేసే స్టేజ్ కు మనుషులు చేరుకున్నారు. అయితే సృష్టిలో కొన్ని జీవులు ప్రేమకి మంచి విలువనిస్తాయి. తమ జీవితాంతం తమ భాగస్వాములకు విశ్వాసపాత్రంగా ఉంటాయి. ఒకవేళ తమ భాగస్వామి దూరమైతే.. కొన్ని జీవులు జీవితాంతం ఒంటరిగా జీవిస్తాయి. అవి ఏమిటంటే..

Surya Kala
|

Updated on: Jun 12, 2025 | 1:15 PM

Share
మనుషులైనా లేదా జంతువులైనా ప్రేమలో ఆకర్షణ కోల్పోయినప్పుడు అవి వేరొక జీవుల వైపు ఆకర్షితులవుతాయి. ప్రస్తుతం ప్రేమ, పెళ్లి, సంబంధాలకు మనుషులు విలువ ఇవ్వడం లేదు. విడాకులు, ప్రేమించి  మోసం చేయడం, చివరకు పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామిని చంపెయ్యడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సృష్టిలోని జీవులలో కొన్ని జీవులు ప్రేమ విషయంలో చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. అవును అవి జీవితాంతం తమ భాగస్వాములను ప్రేమించడమే కాదు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. తమ జీవిత భాగస్వామి చనిపోతే.. అవి జీవితాంతం ఒంటరిగా జీవిస్తాయి. కానీ మరొక దానితో జత కట్టవు. ఈ రోజు ఏ జీవులు తమ భాగస్వాములకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయో తెలుసుకుందాం..

1 / 7
హంసలు: హంసల జంటలను ప్రేమకు నిజమైన చిహ్నంగా భావిస్తారు. ఒక హంస మరొకదానితో జతకట్టిన తర్వాత.. అవి కలిసి గూళ్ళు కట్టుకుంటాయి. తమ పిల్లలను కలిసి పెంచుతాయి. తల్లిదండ్రులుగా తమ  విధులను పంచుకుంటాయి. ఒకసారి జతకట్టిన తర్వాత.. ఈ హంసలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. ప్రేమకు, విధేయతకు ప్రసిద్ధి చెందిన ఈ హంసలలో తమ భాగస్వామి చనిపోతే మరొక భాగస్వామిని ఎంచుకోవు. అవి ఒక భాగస్వామికి విధేయంగా జీవితాంతం ఒంటరిగా జీవిస్తాయి.

2 / 7
తోడేళ్ళు: తోడేళ్ళు ప్రమాదకరంగా కనిపించవచ్చు. కానీ ఇవి ప్రేమ విషయంలో చాలా సున్నితంగా ఉంటాయి. తమ కుటుంబం, సహచరుడి పట్ల చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. అవి సాధారణంగా జీవితాంతం ఒకే సహచరుడితో ఉంటాయి. కలిసి జీవించే, వేటాడే, తమ పిల్లలను చూసుకునే తోడేళ్ళు, తమ సహచరుడు మరణిస్తే.. మిగిలిన తోడేలు జీవితాంతం ఒంటరిగా జీవిస్తాయి.

3 / 7
బీవర్స్: బీవర్లు ఉత్తర అమెరికా ,యురేషియాలో నివసించే అతిపెద్ద ఎలుకలు. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ఎలుకలు. ఈ బీవర్స్ ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే జంతువులలో ఒకటిగా పరిగణించబడతాయి. ఉత్తమ ఇంజనీర్లుగా పిలువబడే ఈ ఎలుకలు తమ ప్రేమ పట్ల.. ప్రేమించిన వారి పట్ల చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. ఈ జంతువులు తమ జీవిత భాగస్వామితో కలిసి ప్రతి పనిని చేస్తాయి. ఇవి తమ జీవితాంతం తమ భాగస్వామితోనే గడుపుతాయి.

4 / 7
 
గిబ్బన్స్: కోతుల కుటుంబానికి చెందిన ఈ జంతువులు కూడా తమ జీవిత సహచరులకు కూడా చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. అవి తమ భాగస్వాములతో సన్నిహిత బంధాలను ఏర్పరుస్తాయి. అవి తమ పిల్లలను కలిసి పెంచుతాయి. ఎక్కువ సమయం తమ భాగస్వామితో గడుపుతాయి. ఇవి తమ భాగస్వామి చనిపోతే.. జీవితాంతం ఒంటరిగా జీవిస్తాయి.

5 / 7
బాల్డ్ ఈగిల్: దీనినే బట్టతల డేగ అని కూడా అంటారు. అమెరికా జాతీయ పక్షి అయిన బాల్డ్ ఈగల్స్ తమ సహచరుల పట్ల అత్యంత విశ్వాసపాత్రంగా ఉంటాయి. ఒకసారి భాగస్వామిని ఎంచుకున్న తర్వాత.. అవి జీవితాంతం అదే భాగస్వామితోనే ఉంటాయి. ఒకవేళ బట్టతల డేగ మరణిస్తే.. మళ్ళీ మరొక దానితో జత కట్టకుండా ఒంటరిగా జీవితాంతం బతికేస్తాయి.

6 / 7
పెంగ్విన్: పెంగ్విన్‌లు కూడా తమ సహచరులకు చాలా విశ్వాసపాత్రంగా ఉంటాయి. అవి జీవితాంతం ఒకే భాగస్వామితోనే ఉంటాయి. అవి తమ పిల్లలను కలిసి చూసుకుంటాయి. పెంగ్విన్‌ల మధ్య ప్రేమ భావన చాలా బలంగా ఉంటుంది.

7 / 7