- Telugu News Photo Gallery Do you know what it means if you see your ex lover in your dream after marriage?
పెళ్లి తర్వాత కలలో మీ లవర్ కనిపించారా..దాని అర్థం ఇదేనంట!
కలలు కనడం అనేది సహజం. కొందరికి రాత్రి పడుకున్న సమయంలో కలలు వస్తే మరికొంత మందికి పగటి కలలు వస్తుంటాయి. ఇక ఒకొక్కరికీ ఒక్కో విధంగా కలలు అనేవి వస్తుంటాయి. కొందరికి చెట్లు, పాములు, పూర్వీకులు కనిపిస్తే, మరికొంత మందికి పాములు, తమ చుట్టూ ఉన్న వ్యక్తులు, లేదా తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఇలా పలు రకాలుగా కలలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇంకొంత మందికి మాత్రం ఏకంగా తమ లవర్ లేదా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలలోకి వస్తుంటారు. అయితే ఇలా పాత లవర్ కలలో కనిపిస్తే దానికి కూడా ఓ అర్థం ఉంది అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. అది ఏంటో ఇప్పుుడు తెలుసుకుందాం.
Updated on: Jun 12, 2025 | 11:58 AM

ఇక కలలు రావడం అనేది కామన్. కానీ ఒక్కో కల ఒక్కో రకమైన సూచనలిస్తుందంట. అయితే కలలు అనేవి కొన్ని సార్లు మనం మన మనసులో ఉండే భావాలు లేదా మన అనుభవాలతో కూడా ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు మనలో ఉండే ఆలోచనలు, లేదా కోరికలు మనకు కలల రూపంలో వస్తుంటాయి. ఇంకొంత మందికి ఉదయం చేసిన పనులు రాత్రి కలలో కనిపిస్తుంటాయి.

కానీ కొన్ని సార్లు కలలు మనల్ని, భవిష్యత్తు పరంగ అప్రమత్తం చేసే ఛాన్స్ ఉన్నదంటున్నారు నిపుణులు. కొన్ని సార్లు మన భవిష్యత్తు గురించి మనం మన కల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చునంట. అలానే కలలో లవర్‌ని చూడటం కూడా కొంత వరకు అది కూడా ఒక రకమైన సూచననే అంటున్నారు పండితులు. అయితే ఇది మనకు ఏరకం సూచన ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

అయితే మీకు పెళ్లై, మీరు మీ బంధంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ మీకు కలలో మీ లవర్ కనిపిస్తే దాని అర్థం ఇప్పటికీ వారిని మీరు మర్చిపోలేకపోతున్నారని అర్థం అంట. అంతే కాకుండా మీరు ఒక బంధంలో ఉన్నప్పటికీ ఎక్కడో మీ పాత లవర్ జ్ఞాపకాలు మీ మదిలోనే నిలిచిపోయాయని, అమ్మాయి లేదా అబ్బాయి ఇంకా మనసులోతుల్లో ఉన్నారని అర్థం అంట. అంతే కాకుండా వారి గుర్తులను మీరు చెరిపేసినప్పటికీ మీ మనసు మాత్రవాటిని చెరపలేకపోతుంది, అందుకే వారితో ఉన్న జ్ఞాపకాలను మీకు కలల రూపంలో కనిపస్తున్నాయని అదర్థం అంట.

ఒక వేళ మీ కలలో బ్రేకప్ అయినట్టు కనిపిస్తే అది మీ ఇద్దరి మధ్య బంధం బలంగా లేదని అర్థం అంట. లేదా మీరే ఆ వ్యక్తి దూరం కావాలని కోరుకుంటున్నారని, అలాగే మీ ఇద్దరి మధ్య నమ్మకం అంతగా లేదు, మీ బంధంలో ఎక్కడో ఒక చోట అభద్రత భావం ఉన్నట్లు అర్థం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా మీరు అతనితో బంధంలో ఉన్నప్పటికీ, తనతో ఫ్యూచర్‌పై ఎక్కువ ఆందోళనకు గురి అవుతున్నట్లు అర్థం వస్తుందంట.

అదే విధంగా మీ కలలో ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపిస్తే దాని అర్థం మీకు త్వరలో పెళ్లికాబోతుందంట. అంతే కాకుండా, మీరు కొత్త బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని, మీ జీవితంలో మరో వ్యక్తితో ముడిపడటానికి సమయం ఆసన్నం అయ్యింది అనే అర్థం వస్తుందంట. అంతే కాకుండా మీరు మరో వ్యక్తితో జీవితం పంచుకోవడానికి రెడీగా ఉన్నారనే అర్థం కూడా వస్తుందంటున్నారు స్వప్నశాస్త్ర నిపుణులు.



