Viral Video: 7 రోజులుగా ఉచ్చులో చిక్కుకున్న కింగ్ కోబ్రా.. పాముకు నీరు తాగించిన యువకుడు.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్..!
King Cobra: కింగ్ కోబ్రా 7 రోజుల పాటు చేపల వలలో చిక్కుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే..

పాము చూస్తే చాలు ఆమడదూరం పారిపోయే వారుంటారు చాలా మంది. మరికొంతమంది చనిపోయిన పామును చూసిన భయంతో వణికిపోతారు. కొన్ని సార్లు మన ఇంట్లోకే వస్తే ఇంకేమైనా ఉండా ప్రాణాలు పోయినంత పనైపోతుంది కదా. అందుకే వాటికి చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కొందరైతే ఏమాత్రం భయం లేకుండా పాములను పట్టుకుని చేతిలో కూడా ఆడిస్తుంటారు. పెద్ద కోబ్రాలను కూడా చాలా ఈజీగా పట్టుకుంటారు. అంతేకాదు ఓ చేతితో ఆట ఆడుకుంటారు. తాజాగా కింగ్ కోబ్రా 7 రోజుల పాటు చేపల వలలో చిక్కుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఓ వ్యక్తి ఈ పామును చేపల వలలో నుంచి బయటకు తీసి కింగ్ కోబ్రా స్నేక్‌కు వాటర్ బాటిల్‌తో నీళ్లు పోసి దాహం తీర్చుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి జనం చలించిపోయారు.
అయితే.. ఆ కింగ్ కోబ్రా స్నేక్ చేపల వలలో చిక్కుకోవడం చూసిన అతను కత్తెరతో వలను కట్ చేశాడు. పాము చాలా రోజులుగా అందులో చిక్కుకుని ఆకలితో ఉండటాన్ని గుర్తించిన యువకుడు దానికి దాహం తీర్చాడు. వాటర్ బాటిల్‌తో నీళ్ళు పోయడంతో.. ఆకలితో నీటినిన తర్వాత ఆ పామును ఓ బ్యాగ్‌లో తీసుకుని అడవి ప్రాంతంలో వదలిపెట్టారు.
వీడియోను ఇక్కడ చూడండి




ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. పాముకు దాహం తీర్చడాన్ని ప్రశంసిస్తూ.. నెటిజన్లు అనేక పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆ పాము నుంచి జాగ్రత్త వహించాల్సింది అని కూడా కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో కూడా ప్రజలు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో కూడా వైరల్ అవుతోంది.
