Optical Illusion: ఈ ఫోటోలో ఓ అందమైన జీవి దాగుంది.. మీవైపే చూస్తోంది.. 5 సెకన్లలో కనిపిట్టే సత్తా మీలో ఉందా?

Optical Illusion: సమస్త సమాచారానికి వేదిక ఇంటర్నెట్. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు, ఫోటోలు, అద్భుతమైన విశేషాలు వైరల్ అవుతుంటాయి.

Optical Illusion: ఈ ఫోటోలో ఓ అందమైన జీవి దాగుంది.. మీవైపే చూస్తోంది.. 5 సెకన్లలో కనిపిట్టే సత్తా మీలో ఉందా?
Optical Illusion
Follow us

|

Updated on: May 25, 2023 | 10:09 AM

సమస్త సమాచారానికి వేదిక ఇంటర్నెట్. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు, ఫోటోలు, అద్భుతమైన విశేషాలు వైరల్ అవుతుంటాయి. అయితే, కొన్ని ఫోటోలు అయితే.. ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. మానసిక గందరగోళాన్ని సృష్టిస్తాయి. పైకి ఒకటి కనిపించినా.. అందులో మరో రహస్యం దాగుంటుంది. అవే ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్. ఇవి ఒక టాస్క్ లాంటివి. మెదడుకు పని చెబుతాయి. ఆసక్తిని కలిగించడంతో.. సహనాన్ని, మెదడు పనితీరును పెంచుతాయి ఈ ఆప్టికల్ ఇల్యూజన్స్. తాజాగా ఇలాంటి స్టన్నింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటో ఒక కొండ గుట్టలకు సంబంధించింది. నల్లటి కొండ గుట్టలపై అక్కడక్కడా గడ్డి పొదలు ఉన్నాయి. అవి మాత్రమే కాదు.. అక్కడ మరొక అందమైన జీవి కూడా దాగుతుంది. అయితే, ఆ గుట్టలు, గడ్డిలో కలిసిపోయింది. కానీ, ఆ జీవి మాత్రం తదేకంగా ఒకవైపు మాత్రమే చూస్తోంది. దానిని కనిపెట్టడమే ఇప్పుడు మీ టాస్క్. కొండగుట్టల నడుమ ఠీవీ నిల్చుని ఆ జీవిని జస్ట్ 5 సెకన్ల వ్యవధిలో కనిపిస్తే.. నిజంగా మీ బ్రెయిన్ చాలా షార్ప్‌గా పని చేస్తుందని భావించొచ్చు. అంతేకాదు.. మీ కంటి చూపునకు కూడా ఇది అగ్నిపరీక్ష లాంటిదని చెప్పొచ్చు. కంటి చూపు సరిగా ఉంటే.. ఈ జీవిని ఇట్టే కనిపెట్టేయొచ్చు. మరెందుకు ఆలస్యం.. ఆ జీవి ఎక్కడుందో కనిపెట్టేయండి.

ఏంటీ ఆన్సర్ దొరకలేదా?

ఏంటి.. ఆ జీవి కనిపించలేదా? మరేం పర్వాలేదు. చిన్న హింట్ ఇస్తున్నాం.. దాని ఆధారంగా ట్రై చేయండి. ‘సీతమ్మ కోరిందని, శ్రీరాములు ఆ జీవి కోసం వెళ్లాడు.’ దీని ఆధారంగా.. ఆ జీవి ఏంటో ఈ జీగా కనిపెట్టేయొచ్చు. ఎక్కడుందో కూడా తెలుసుకోవచ్చు. అప్పటికీ కనిపెట్టలేకపోతే.. కింద ఫోటోలో రౌండప్ చేసి ఇవ్వడం జరిగింది. దానిని గమనించొచ్చు.

ఇవి కూడా చదవండి
Deer

Deer

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..