Optical illusions: ఇది కదా అసలైన పజిల్ అంటే.. ఈ ఫొటోలో ఉన్న మొసలిని కనిపెట్టాలంటే బుర్ర వేడెక్కాల్సిందే..
సోషల్ మీడియాలో ఎప్పుడెదో ఒక ట్రెండ్ నడుస్తుంటుంది. వైరల్ వీడియోలు, ఆసక్తికర విషయాలకు పెట్టింది పేరైన సోషల్ మీడియా ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూజన్‌కు కూడా వేదికవుతోంది. మెదడుకు మేతగా ఉండే ఈ ఫొటో పజిల్స్‌పై నెటిజన్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో...

సోషల్ మీడియాలో ఎప్పుడెదో ఒక ట్రెండ్ నడుస్తుంటుంది. వైరల్ వీడియోలు, ఆసక్తికర విషయాలకు పెట్టింది పేరైన సోషల్ మీడియా ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూజన్‌కు కూడా వేదికవుతోంది. మెదడుకు మేతగా ఉండే ఈ ఫొటో పజిల్స్‌పై నెటిజన్లు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇలా ఆప్టికల్ ఇల్యూజన్ పోస్ట్ చేయగానే అలా నెట్టింట ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లకు సవాల్ విసురుతోంది. పైన ఫొటోలో నీటి కొలను కనిపిస్తోంది కదూ. నీటిలో గడ్డి, చుట్టు మొక్కలు ఉన్న ఈ ఫొటోలో ఓ మొసలి కూడా దాగి ఉంది. పూర్తి శరీరం అంతా నీటిలో ఉండగా కేవలం మొహం మాత్రమే కనిపించీ కనిపించనట్లు కనిపిస్తోన్న ఆ మొసలి నన్ను పట్టుకోండి చూద్దాం అన్నట్లు సవాల్ విసురుతోంది.




అయితే మొసలిని కనుక్కోవడం మాత్రం అంత సులభమేమి కాదండోయ్. చుట్టూ ఉన్న ఆకుల రంగుల్లో కలిసిపోవడంతో అంత సులభంగా గుర్తించలేం. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. ఈ ఫొటోలో ఉన్న మొసలిని గుర్తించండి అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటోకు కామెంట్ల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ మీరు మొసలిని కనిపెట్టారా.? ఎంత ప్రయత్నించినా కనిపించకపోతే కింద ఉన్న ఫొటో చూడండి. రెడ్ సర్కిల్‌లో మొసలి నక్కి నక్కి చూస్తోంది గమనించారా.?
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..
