AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడాదికి ఒక్కసారే వికసించే వింత పుష్పం.. టెర్రస్ గార్డెన్‌లో కనువిందు చేస్తున్న ఫుట్‌బాల్ లిల్లీ!

ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు. కొన్ని మొక్కలు నిత్యం పూలు పూస్తే, మరికొన్ని మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించి తమ ప్రత్యేకతను చాటుకుంటాయి. అచ్చం అలాంటి అరుదైన పుష్పమే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్. దీనిని సాధారణంగా ఫుట్‌బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అని పిలుస్తుంటారు. తాజాగా నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం టెర్రస్ గార్డెన్‌లో ఈ పుష్పాలు వికసించి అందరినీ అబ్బురపరుస్తున్నాయి.

ఏడాదికి ఒక్కసారే వికసించే వింత పుష్పం.. టెర్రస్ గార్డెన్‌లో కనువిందు చేస్తున్న ఫుట్‌బాల్ లిల్లీ!
Blood Lily Flower
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 06, 2026 | 9:42 AM

Share

భూగోళంపై జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అలాగే ఏడాది లో కేవలం ఒకే సారి పూసే అరుదైన మొక్క ఒకటి ఉంది. ఆ మొక్క పుష్పాలు కేవలం మే నెలలోనే వికసించి అందరినీ ఆకట్టుకుంటాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన వార్ల మల్లేశం అనే ఉపాధ్యాయుడి టెర్రస్ గార్డెన్ లో ఈ అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది.  సంవత్సరంలో కేవలం మే మాసంలో ఒక్కసారి మాత్రమే పూసే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ @ పుట్బాల్ లిల్లీ వికసించింది. ఈ మొక్క వృక్షరాజ్యంలోని అమరిల్లిడేసి కుటుంబానికి చెందిది. ఈ దుంపకాండ మొక్క శాస్త్రీయ నామం స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ కాగా భారత దేశంలో ఈ మొక్కను పుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అనే పేర్లతో పిలుస్తుంటారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఈ మొక్క ఉనికి దేశంలో ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు నుండి ఆసక్తి తో పదేళ్ల క్రితం ఈ మొక్క దుంపను తెచ్చి కుండీలో నాటారు మల్లేశం. ప్రతి ఏటా మే నెలలో ఒక్క పువ్వు మాత్రమే వచ్చేదని గత ఏడాది నాలుగు పుష్పాలు పూయగా, ఇప్పుడు అయిదు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. జూన్ నెల వరకు ఈ పుష్పాలు ఉంటాయని ఆ తరువాత అవి రాలి పోతాయి. ఆ తర్వాత వచ్చిన ఆకులు జనవరి వరకు మాత్రమే ఉండి ఎండిపోతాయి. కేవలం దుంప మాత్రమే మట్టిలో దాగి ఉండి మే నెలలో మొగ్గలు తోడిగి పువ్వులు వస్తాయని, అందుకే మే పుష్పం అని పిలుస్తారని మల్లేశం చెప్పారు. ఒక్క సారి దుంప నేలలో పాతితే ఈ మొక్కకు మరణం ఉండకపోవడం విశేషం.

ఇక మల్లేశం ఇంట్లో ఫుట్ బాల్ లిల్లీ వికసించిన సమాచారం తెలుసుకొని కోస్గి పట్టణ వాసులు చూసేందుకు క్యూ కట్టారు. అరుదైన పుష్పాన్ని చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ‘లిల్లీ’ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us