AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating Trends 2026: రిలేషన్‌షిప్‌లోనూ GenZలు కొత్త దారులు కావాలనే అనుకుంటున్నారా?

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లు, అర్థం పర్థం లేని ‘సిట్యుయేషన్‌షిప్స్’ నుండి నేటి జెన్ జెడ్ యువత పూర్తిగా బయటకు వచ్చేస్తోంది. 2026లో డేటింగ్ ప్రపంచం మారుతోంది. అనవసరమైన హంగులు, ఆడంబరాలు, సినిమా తరహా ప్రపోజల్స్ కంటే.. ఎమోషనల్ అండర్‌స్టాండింగ్, నిజాయితీకి ఈ తరం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రేమ అంటే ఖరీదైన గిఫ్ట్‌లు మాత్రమే కాదని, రోజువారీ జీవితంలోని చిన్న చిన్న క్షణాల్లోనే అసలైన సంతోషం ఉందని యువత నమ్ముతోంది. ఈ తరం లవ్ డిక్షనరీలోకి వచ్చిన కొన్ని క్రేజీ డేటింగ్ ట్రెండ్స్ ఇవే..

Dating Trends 2026: రిలేషన్‌షిప్‌లోనూ GenZలు కొత్త దారులు కావాలనే అనుకుంటున్నారా?
Modern Romance.jpg
Nikhil
|

Updated on: May 31, 2026 | 11:19 PM

Share

పెద్ద పెద్ద హోటళ్లలో డిన్నర్ల కంటే, ఇద్దరూ కలిసి సూపర్ మార్కెట్‌లో గ్రాసరీస్ కొనడం, ఇంటి పనుల్లో సాయం చేసుకోవడం వంటి రొటీన్ పనుల్లోనే ఈ తరం రొమాన్స్ వెతుక్కుంటోంది. దీనినే ‘చోరొమాన్స్’ అని పిలుస్తున్నారు. అలాగే, తమ అభిరుచులకు పూర్తిగా భిన్నమైన వ్యక్తులతో డేటింగ్ చేసి కొత్త కెమిస్ట్రీని ఎక్స్‌ప్లోర్ చేయడాన్ని ‘కాంట్రా డేటింగ్’ అంటున్నారు. భాగస్వామిలోని వింత అలవాట్లను, పిచ్చి చేష్టలను ఇద్దరూ సమానంగా పంచుకుంటూ బాండింగ్ పెంచుకోవడాన్ని ‘ఫ్రీక్ మ్యాచింగ్’ అని పిలుస్తున్నారు. ఇవి బంధాన్ని మరింత అథెంటిక్‌గా మారుస్తున్నాయి.

నెక్స్ట్ లెవెల్..

ఏ విధమైన మొహమాటాలు, జడ్జ్‌మెంట్ భయం లేకుండా.. ఒకరి ముందు ఒకరు ఎలా ఉన్నా సౌకర్యంగా గడపడాన్ని ‘గాబ్లింటిమసీ’ అంటున్నారు. ఇది రిలేషన్‌షిప్‌లో కంఫర్ట్ స్టేజ్‌ను తెలియజేస్తుంది. ఇక గ్రాండ్ సర్ప్రైజ్‌లకు బదులుగా, లవర్ కోసం కాఫీ తీసుకురావడం, నచ్చిన మీమ్స్ షేర్ చేయడం వంటి చిన్న చిన్న కేరింగ్ యాక్ట్స్ ద్వారా ప్రేమను వ్యక్తపరచడాన్ని ‘మైక్రో-మాన్స్’ అని పిలుస్తున్నారు. ఇవి బంధంలో అపారమైన ప్రేమని చూపిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా, బంధానికి ఎలాంటి గడువులు, కండిషన్లు పెట్టుకోకుండా.. ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ డెప్త్‌ను ఆస్వాదిస్తూ బంధాన్ని సహజంగా ఎదగనివ్వడాన్ని ‘వైల్డ్‌ఫ్లవరింగ్‌’ అని పిలుస్తున్నారు.

అసలైన పెర్ఫెక్షన్..

షో-ఆఫ్ చేసే ప్రేమ కంటే ప్రశాంతంగా, మనసుకు నచ్చినట్టు ఉండే రిలేషన్‌షిప్‌లే గ్రేట్ అని జెన్ జెడ్ భావిస్తోంది. 2026 నాటి ఈ డేటింగ్ ట్రెండ్స్ అన్నీ పర్ఫెక్షన్ కంటే నిజాయితీకే పెద్ద పీట వేస్తున్నాయి. ఇద్దరి మధ్య పారదర్శకత ఉన్నప్పుడే లైఫ్‌ను పూర్తిగా ఆస్వాదించవచ్చని ఈ తరం నమ్ముతోంది. మీ పార్ట్‌నర్‌తో మీరు ఇందులో ఏ స్టేజ్‌లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. బంధాల్లో నిజాయితీ ఉన్నప్పుడే ఆ జీవితానికి ఒక అర్థం, ఒక ఫీలింగ్ ఉంటాయి. ఈ కొత్త ట్రెండ్స్ మీ రిలేషన్‌షిప్‌ను మరింత దృఢంగా మార్చడం ఖాయం.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా