AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందం కోసం ఇంజెక్షన్లా? దాంపత్య సుఖాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వెయిట్ లాస్ డ్రగ్స్.. డాక్టర్ల షాకింగ్ హెచ్చరిక!

ఒకప్పుడు పెళ్ళంటే.. ఏడడుగుల బంధం. ఇప్పుడు పెళ్ళంటే.. ఆరు పలకల దేహం. అబ్బాయిలకు సిక్స్ ప్యాక్ పిచ్చి.. అమ్మాయిలకు జీరో సైజ్ వెర్రి. కానీ, ఈ అందం వెనుక ఉన్న అసలు రంగు.. మరణం రాసిన ముసుగు. పెళ్లి పీటల మీద మెరవాల్సిన మేని ఛాయ.. మందుల వాసనతో మాడిపోతోంది. అసలు ఈ షార్ట్-కట్ అందం వెనుక దాగున్న లాంగ్-టర్మ్ అనారోగ్యాలు ఎవరికీ తెలియదు..! దాంపత్య జీవితాన్ని ఈ సూదులు ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో వైద్యులు చెబుతున్నది వింటే షాక్ తింటారు.

అందం కోసం ఇంజెక్షన్లా? దాంపత్య సుఖాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వెయిట్ లాస్ డ్రగ్స్.. డాక్టర్ల షాకింగ్ హెచ్చరిక!
Weight Loss Injections Risks
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: May 06, 2026 | 8:55 AM

Share

అందం ఒక అలంకారం.. అది ప్రాణానికి ఆభరణం కావాలి. కానీ, మృత్యువుకు కారణం కాకూడదు. పెళ్లి సంబంధాలు కుదరాలని, పదిమందిలో మెరవాలని సెమాగ్లుటైడ్ లాంటి ఇంజెక్షన్లను బాడీలోకి ఎక్కించుకుంటున్నారు నేటి యువత. షార్ట్-కట్ తాత్కలికంగా బాగుంటుంది. కానీ, దాని పర్యవసానం భయంరంగా ఉంటుంది. ఇంటర్నెట్ గురువుల మాటలు విని.. ఇన్‌ఫ్లుయెన్సర్ల మాయలో పడి.. ప్రిస్క్రిప్షన్ లేని మందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొవ్వును కరిగించే ఈ ఇంజెక్షన్లు.. ఆయువును కరిగించేస్తున్నాయి.

పెళ్లి పీటల మీద రాజులా ఉండాలని ఆశపడి.. తీరా పెళ్లయ్యాక రోగిలా మారుతున్నారు. ఈ ఇంజెక్షన్ల ప్రభావం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత తలకిందులవుతోంది. సంసార జీవితంలో సంతోషం మృగ్యమవుతోంది. మాతృత్వానికి నోచుకోని మహిళలు.. పౌరుషం కోల్పోతున్న పురుషులు. ఇదంతా ఆ ఒక్క సూది చేసిన గాయమే. ముఖంలో మెరుపు కోసం వేసుకున్న ఆ మందు.. ముఖాన్ని ముసలితనం వైపు నెట్టేస్తోంది. పద్దతి ప్రకారం లేకుండా వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో అనార్ధలే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్ పృథ్వీరాజ్ సనమండ్ర, ఎండోక్రినాలజిస్ట్.

చెమట చిందించని శరీరం.. వ్యాధులకు నిలయం. కష్టపడకుండా వచ్చే అందం.. కష్టాల్లోకి నెట్టే విషం. ఇంజెక్షన్లు ఆపగానే బరువు మళ్లీ పెరుగుతారు.. కానీ, పోయిన ఆరోగ్యం మాత్రం తిరిగి రాదు. అందుకే.. అందమైన రూపం కంటే.. ఆరోగ్యమైన ప్రాణమే మిమ్మల్ని నిలబెడుతుందని చెబుతున్నారు. వ్యాయామం, సరైన పోషకాహారం ద్వారా బరువు తగ్గడం ఉత్తమమైన మార్గం. మెరుపు కోసం వేసుకునే సూది.. రేపటి మీ భవిష్యత్తుకు తూట్లు పొడవకుండా జాగ్రత్త పడండి. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా క్వాలిఫైడ్ ఎండోక్రినాలజిస్ట్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర