AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? అవసరం లేదు! ఈ పద్ధతులు పాటిస్తే సన్నగా, నాజుగ్గా ఉండొచ్చు..!!

బరువు తగ్గాలనుకునే వారు సాధారణంగా అన్నం తినడం పూర్తిగా మానేస్తుంటారు. అయితే, అన్నం మానేయాల్సిన అవసరం లేదని, తినే పద్ధతిని మార్చుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అన్నంతో పాటు ఎక్కువ కూరగాయలు లేదా పప్పును చేర్చుకోవడం వల్ల కేలరీలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట అన్నం తినే అలవాటు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన సమయంలో, సరైన మోతాదులో అన్నం తీసుకోవడం ద్వారా బరువు పెరగకుండానే మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? అవసరం లేదు! ఈ పద్ధతులు పాటిస్తే సన్నగా, నాజుగ్గా ఉండొచ్చు..!!
Healthy Eating
Jyothi Gadda
|

Updated on: May 05, 2026 | 12:49 PM

Share

మన దేశంలో అన్నం ప్రధాన ఆహారం. అయితే బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వారు మొదట చేసే పని అన్నం తినడం ఆపేయడం. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామనేది నిజమే అయినప్పటికీ, దానిని తినే విధానం తెలిస్తే మాత్రం బరువు పెరగకుండానే అన్నం తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అన్నం తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు తప్పక గుర్తుంచుకోండి.. అవేంటంటే…

గంజి వార్చడం: ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటం వల్ల అందులోని స్టార్చ్ (Starch) అలాగే ఉంటుంది. దీనికి బదులుగా గిన్నెలో వండి, ఉడికిన తర్వాత గంజి వార్చడం వల్ల కార్బోహైడ్రేట్లు, కేలరీల శాతం గణనీయంగా తగ్గుతుంది.

పోర్షన్ కంట్రోల్ (పరిమిత మోతాదు): మీరు తీసుకునే ప్లేట్‌లో అన్నం తక్కువగా ఉండాలి. ఒక చిన్న కప్పు అన్నం తీసుకుని, మిగిలిన ప్లేట్‌ను కూరగాయలు, పప్పు లేదా పెరుగుతో నింపాలి. దీనివల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. అతిగా తినడం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

కూరగాయలతో కలపండి: అన్నం వండేటప్పుడు అందులో బీన్స్, క్యారెట్, బఠానీలు వంటి కూరగాయలు చేర్చి వెజిటబుల్ రైస్ లాగా చేసుకోవడం వల్ల మీకు ఫైబర్ (పీచు పదార్థం) అందుతుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది.

సరైన సమయం: అన్నం తినడానికి మధ్యాహ్నం సమయం ఉత్తమమైనది. పగటిపూట మన జీవక్రియ (Metabolism) వేగంగా ఉంటుంది. కాబట్టి, అన్నం సులభంగా జీర్ణమవుతుంది. ఒకవేళ రాత్రిపూట అన్నం తినాలనుకుంటే, నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందే తినాలి.

బ్రౌన్ రైస్ ఎంచుకోండి: వీలైతే తెల్ల అన్నం కంటే బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యం తినడం మేలు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

ఆహారాన్ని నియంత్రించడం అంటే ఇష్టమైన వాటిని పూర్తిగా వదిలేయడం కాదు, వాటిని తెలివిగా తీసుకోవడం. అన్నం వండే విధానంలో, తినే మోతాదులో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్య లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !