AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ మందార మొక్కకు పూలు పూయడం లేదా? ఈ సీక్రెట్ చిట్కాలు పాటిస్తే పూల వర్షం కురవాల్సిందే!

మందార మొక్కలు ప్రతి ఇంట్లోనూ అందాన్ని, ఆధ్యాత్మికతను పంచుతాయి. అయితే చాలామంది తమ మందార మొక్కలు పెరగడం లేదని లేదా మొగ్గలు రావడం లేదని బాధపడుతుంటారు. గార్డెన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మందార మొక్కకు కేవలం నీరు మాత్రమే సరిపోదు, సరైన పోషకాలు, సూర్యరశ్మి కూడా అవసరం. ముఖ్యంగా ఇంటి చిట్కాలు, సేంద్రియ ఎరువుల ద్వారా ఈ మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని చెబుతున్నారు. మందార మొక్క సంరక్షణకు అవసరమైన రహస్య చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

మీ మందార మొక్కకు పూలు పూయడం లేదా? ఈ సీక్రెట్ చిట్కాలు పాటిస్తే పూల వర్షం కురవాల్సిందే!
Hibiscus
Jyothi Gadda
|

Updated on: May 05, 2026 | 11:37 AM

Share

భారతీయ గృహాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పూల మొక్కలలో మందార ఒకటి. వివిధ రంగుల్లో లభించే ఈ పూలు తోటకి అందాన్ని ఇవ్వడమే కాకుండా, దేవుడి పూజలోనూ ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. అయితే, మందార మొక్కలు ఏపుగా పెరిగి, కొమ్మకొమ్మకు మొగ్గలు రావాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గార్డెన్ నిపుణులు సూచిస్తున్నారు.

మందార ఉష్ణమండల మొక్క. దీనికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగలాలి. ఎండ సరిగ్గా ఉంటేనే మొక్క కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుని మొగ్గలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటుగా మొక్కల అవసరమైన ఎదుగుదలకు ఖరీదైన ఎరువులు అక్కర్లేదు. మన వంటగదిలో లభించే వస్తువులే అద్భుతమైన ఎరువులుగా పనిచేస్తాయి. ఇందులో బియ్యం కడిగిన నీరు, ఉల్లిపాయ పొట్టు, వెజిటేబుల్‌ వేస్ట్‌ కూడా అద్భుతమైన ఏరువుగా పనిచేస్తుంది.

బియ్యం లేదా పప్పులు కడిగిన నీటిని పారబోయకుండా మొక్క మొదట్లో పోయండి. ఇందులో ఉండే ఖనిజాలు మొక్క వేర్లను దృఢపరుస్తాయి. అలాగే, ఉల్లిపాయ పొట్టును నీటిలో రెండు రోజులు నానబెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పొటాషియం అందుతుంది. ఇది ఎక్కువ పూలు పూయడానికి సహాయపడుతుంది. ఇకపోతే, మొక్క పొడవుగా పెరిగిపోవడం కంటే, ఎక్కువ కొమ్మలు వస్తేనే ఎక్కువ పూలు పూస్తాయి. అందుకే కాలానుగుణంగా ఎండిన కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల కొత్త చిగుళ్లు వచ్చి మొగ్గలు తొడుగుతాయి.

ఇవి కూడా చదవండి

వారానికి ఒకసారి మొక్క మొదట్లో ఉన్న మట్టిని కొద్దిగా తవ్వి గాలి ఆడేలా చేయాలి. దీనివల్ల వేర్లకు ఆక్సిజన్ అందుతుంది. మందారకు సాధారణంగా పిండి నల్లి (Mealybugs) తెగులు వస్తుంది. దీని నివారణకు కొద్దిగా వేప నూనెను నీటిలో కలిపి ఆకులపై చల్లడం మంచిది. ఈ చిన్నపాటి చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ ఇంట్లోని మందార మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉండటమే కాకుండా, రంగురంగుల పూలతో కళకళలాడుతుంది. నేడే మీ మొక్కలకు ఈ సంరక్షణ మొదలుపెట్టండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !