AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన పెద్ద నటుడు.. కానీ నా యాక్టింగ్ చూసి షాకయ్యాడు.. షూటింగ్ ఆపి ఏం చెప్పాడంటే.. తాగుబోతు రమేష్..

నటుడు తాగుబోతు రమేష్ తన సినీ ప్రస్థానం, కృష్ణవంశీ మహాత్మ సినిమా ఆడిషన్ గురించి వివరించారు. తన "తాగుబోతు" నటన చూసి కృష్ణవంశీతో పాటు మరో పెద్ద నటుడు ఎంతగానో ఆశ్చర్యపోయారని, అప్పటి నుండి ప్రోత్సహించారని తెలిపారు. ఆడిషన్లు, పాత్రల ఎంపికపై తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఆయన పెద్ద నటుడు.. కానీ నా యాక్టింగ్ చూసి షాకయ్యాడు.. షూటింగ్ ఆపి ఏం చెప్పాడంటే.. తాగుబోతు రమేష్..
Thagubothu Ramesh
Rajitha Chanti
|

Updated on: May 30, 2026 | 6:34 PM

Share

నటుడు తాగుబోతు రమేష్ తన సినీ ప్రస్థానం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మహాత్మ సినిమా ఆడిషన్, హాస్యనటుడు బ్రహ్మానందంతో తన అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్ బిగినింగ్‌లో స్ట్రగుల్స్ పెద్దగా లేవని, ఏ ఆడిషన్‌కు వెళ్లినా అవకాశం లభించేదని రమేష్ తెలిపారు. ఆయన నటన చూసి చాలామంది షాక్ అయ్యేవారని, ప్రత్యేకించి తన “తాగుబోతు” యాక్టింగ్‌కు మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. తాగుబోతు రమేష్ తన జీవితంలో బెస్ట్ ఆడిషన్‌గా కృష్ణవంశీ మహాత్మ సినిమా ఆడిషన్‌ను తెలిపారు. మొదట ఉత్తేజ్ ద్వారా కృష్ణవంశీని కలిసినప్పుడు, ఆడిషన్ లేకుండానే చూద్దాంలే రా అని పంపించేశారు. దీంతో రమేష్‌కు నిరాశ కలిగిందని. అయితే, తర్వాత ఇన్‌స్టిట్యూట్‌లో తనతోపాటు ఫ్యాకల్టీ టీచర్‌గా పనిచేసిన ధనరాజ్ (అసిస్టెంట్ డైరెక్టర్) సహాయంతో అమీర్‌పేట్‌లో జరిగిన ఆడిషన్‌కు పిలుపొచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ ఆడిషన్ నిజానికి నటుల కోసం కాదని, గాంధీ పాత్రకు ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ అనే పాట కోసం కాసర్ల శ్యామ్ బృందం కోసం జరిగిందని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

క్రిష్ణవంశీని కలిసే ముందు, అసిస్టెంట్ డైరెక్టర్ ఖాజా, ఇతర బృందం రమేష్ “తాగుబోతు” యాక్టింగ్‌ను వీడియో తీసి చూపించారు. అది చూసిన తర్వాత, కృష్ణవంశీ రమేష్‌ను చూసి ఆ నువ్వేంట్రా ఇక్కడ? అనగా, ధనరాజ్ ఏదో ఒకసారి చూడమని కోరాడు. రమేష్ తన అద్భుతమైన తాగుబోతు నటనను ప్రదర్శించగా, కృష్ణవంశీ నీ అమ్మ ఎవరురా నీది? నీ ఏజ్ ఎంత ఉంటుందిరా? అని ఆశ్చర్యపోయి, వెంటనే 30 రోజులు డేట్స్ ఇచ్చారు. అలా మహాత్మ సినిమాలో రమేష్‌కు అవకాశం లభించింది. మహాత్మ సెట్‌కు ఎవరొచ్చినా రవితేజ, శ్రీకాంత్ వంటివారు రమేష్ “తాగుబోతు” నటనను చూసి మెచ్చుకునేవారని రమేష్ గుర్తుచేసుకున్నారు. బ్రహ్మానందంతో కలిసి నటించే సన్నివేశం రమేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. కొత్త నటులను బ్రహ్మానందం అంతగా పట్టించుకోరని ముందు భయపెట్టినా, రమేష్ మాత్రం తన నటనతో బ్రహ్మానందంని ఆశ్చర్యపరిచారు. కృష్ణవంశీ, బ్రహ్మానందంని డాడీ అని పిలిచి, వీడు తాగుబోతు రమేష్, ఒక తెలుగు ఇండస్ట్రీని పదేళ్లు ఏలుతాడు అని చెప్పినప్పుడు, బ్రహ్మానందం పెద్ద స్టార్ అయినప్పటికీ ఆ విషయాన్ని వింటూనే ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఒక సన్నివేశంలో శ్రీకాంత్‌ను కొట్టగా, “మా దాసాన్నే కొడతావారా” అని రెండు అడుగులు వేసిన రమేష్ నటనను చూసి బ్రహ్మానందం ఆపు ఆపు ఆపు. ఓరి నీ అమ్మ! ఎప్పుడూ వంశీ ఇలాంటి వాళ్ళు ఎక్కడ వస్తారు. చేయి రా, చేయి రా అంటూ ఎంతగానో అభినందించారని అన్నారు.. ఆ రోజు నుంచి బ్రహ్మానందం ఇప్పటికీ తనకు మద్దతుగా ఉన్నారని, ఇటీవల ఆయనతో కలిసి అమెరికా వెళ్ళడం తన జీవితంలోనే బెస్ట్ ట్రిప్ అని రమేష్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

Follow Us