Telugu News Trending Old viral video when sonali phogat thrashes official with a slipper in hisar
Viral Video: నువ్వు లేవు నీ స్మృతులు పదిలం.. ప్రభుత్వ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సోనాలి ఫోగట్ వీడియో వైరల్..
ఆ వీడియోలో ఆమె ప్రభుత్వ ఉద్యోగిని చెప్పులతో కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో హర్యానాలోని హిసార్‌లోని అనాజ్ మండికి చెందినది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో సోనాలి ఫోగట్ ఆ ఉద్యోగిని చెప్పుతో కొట్టారు.
Viral Video: హర్యానా బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ అకస్మాత్తుగా ఈ లోకం నుంచి విడిచి వెళ్లిపోయారు. 41 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారు . సోనాలి హఠాన్మరణంతో కోట్లాది మంది అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ పాత వీడియో ట్విట్టర్‌లో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ప్రభుత్వ ఉద్యోగిని చెప్పులతో కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో హర్యానాలోని హిసార్‌లోని అనాజ్ మండికి చెందినది. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో సోనాలి ఫోగట్ ఆ ఉద్యోగిని చెప్పుతో కొట్టారు.
సోనాలి ఫోగట్‌పై అనాజ్ మండి ఉద్యోగి సుల్తాన్ సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురైన సోనాలి ఫోగట్ వెంటనే చెప్పులు తీసి అక్కడున్న ఉద్యోగిని కొట్టింది. అంతేకాదు సోనాలి ఫోగట్ .. సదరు ఉద్యోగినిపై అరిచినట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో తెరపైకి వచ్చిన అనంతరం హర్యానాలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు కూడా సోనాలిపై తీవ్ర విమర్శలు చేశారు.
Shocking #SonaliPhogat‘s tricolor rally. But she is not with us today.
But their memories will always be remembered.
సోనాలి ఫోగట్ గోవాలో కన్నుమూశారు. సోనాలి మృతితో అభిమానులు షాక్‌కు గురయ్యారు. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని.. జీవితం చాలా అనూహ్యమైనదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోనాలి ఫోగట్ 2019 హర్యానా ఎన్నికలలో అడంపూర్ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. టిక్‌టాకర్‌గా వెలుగులోకి వచ్చిన అనంతరం బిగ్ బాస్ లో పాల్గొన్నది. బిగ్ బాస్ సీజన్ 14లో ఆమె 33 రోజుల పాటు ఉన్నారు.