Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..

Rare Coins: ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏం వస్తుంది? చాక్లెట్, షాంపూ కూడా రావడం లేదు. కూరగాయల మార్కెట్‌కు వెళితే,

Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..
Old Coins
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2021 | 1:53 PM

Rare Coins: ఈ రోజుల్లో ఒక రూపాయికి ఏం వస్తుంది? చాక్లెట్, షాంపూ కూడా రావడం లేదు. కూరగాయల మార్కెట్‌కు వెళితే, ఒక్క రూపాయికి కొత్తిమీర, పుదీనా కూడా లభించదు! అయితే దశాబ్దాల నాటికి చెందిన ఒక్క రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే మాత్రం మీ పంట పండినట్లే. ఎందుకంటే దాని విలువ లక్షల్లో ఉంటుంది. పాతకాలం నాటి 1 రూపాయి కాయిన్‌తో మీరు 20 లక్షల రూపాయలు పొందవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఔత్సాహికులకు కొరత లేదు. చాలా మందికి పురాతన వస్తువులను సేకరించడం ఇష్టం. చాలా మంది పాత, అరుదైన నాణేలను సేకరించడానికి ఇష్టపడతారు. అలాంటి నాణేల కోసం అధిక ధరలను చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే.. మీ దగ్గర అలాంటి అరుదైన నాణేలు ఉంటే మీరు కూడా ధనవంతులు కావచ్చు.

మీ ఇంట్లో కూడా పాత నాణాలు ఉండవచ్చు.. మీరు గమనించకపోవచ్చు కానీ మీ ఇంట్లో కూడా పాత నాణాలు ఉండే ఉంటాయి. సరిగ్గా వెతికితే.. ఆ నాణెం మీకు దొరికితే.. మీరు లక్షాధికారులు అయిపోవచ్చు. అయితే, 1906, 1917, 1918 తయారు చేయబడిన 1 రూపాయి నాణెలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నాణెలు రూ. 20 లక్షల మేర పలుకుతున్నాయి. వాస్తవానికి దేశ, విదేశాల్లో అనేక రకాల నాణెలు అందుబాటులో ఉన్నాయి. అయితే, కాలం మారడంతో అనేక అంశాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పురాతన నాణెలను ముద్రించడం ప్రభుత్వాలు నిలిపివేశాయి. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త కొత్త నాణెలను ముద్రిస్తున్నారు. దాంతో పురాతన నాణెలకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది.

పురాతన వస్తువులకు విలువ ఎక్కువ.. వెబ్‌సైట్లలో పాత వస్తువులను విక్రయించడం ద్వారా ప్రజలు లక్షాధికారులుగా మారే వార్తలను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వీటిని చూసినప్పుడు.. మనకెందుకు ఇలాంటి ఛాన్స్ రాలేదా? అని పలువురు వాపోతుంటారు. వాస్తవానికి, కొన్ని ఇ-కామర్స్ సైట్లు ఈ రకమైన అవకాశాన్ని కల్పిస్తాయి. వస్తువులు, విషయాలు చాలా పురాతనమైనవి అయితే.. వాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది.

మీ దగ్గర ఈ మూడు రకాల నాణేలు ఉన్నాయా?.. ఈ రోజుల్లో పాత నోట్లు, నాణేలకు డిమాండ్ పెరుగుతోంది. ఒక రూపాయి, రెండు రూపాయిలు, 5 రూపాయల నాణెల ధరలు ఈ రేంజ్‌లో పెరుగుతాయని అస్సలు ఊహించి ఉండరు. అయితే, ఈ మూడు పురాతన నాణెలు ఇప్పుడు మీ వద్ద ఉన్నట్లయితే.. లక్షల రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ-కామర్స్ సైట్ క్వికర్‌లో ఈ పురాతన నాణేలు విక్రయించేందుకు అవకాశం కల్పిస్తోంది.

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు విడుదలైన ఒక్క రూపాయి నాణెలుకు ప్రస్తుతం విలువ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ నాణేలు 1906, 1907, 1918 సంవత్సరాలలో విడుదలైనవి అయి ఉండాలి. మీ వద్ద ఇలాంటి నాణెలు ఉన్నట్లయితే.. వెంటనే ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టేయండి. దానికి బదులుగా మీరు రూ. 20 లక్షలు పొందొచ్చు.

రూ. 20 లక్షలు పొందాలంటే ఏం చేయాలి.. ముందుగా.. మీ వద్ద ఉన్న నాణెలు పురాతన నాణెలు ఉన్నట్లయితే.. వెంటనే quikr.com సైట్‌లో ఆన్‌లైన్ విక్రేతగా మీ పేరును నమోదు చేసుకోండి. ఇంట్లోనే కూర్చుని ఈ నాణెలను సులభంగా అమ్మవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం. (https://www.quikr.com/home-lifestyle/1906-1917-1918-rare-coins-delhi/p/355329912) లో చూడొచ్చు. ఈ లింక్ క్లిక్ చేశాక.. మీ పేరు, నంబర్, ఇ-మెయిల్ మొదలైనవి వివరాలు నమోదు చేసి.. మీ అకౌంట్‌ను ఓపెన్ చేయాలి. అలా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వొచ్చు.

లాగిన్ అయ్యాక రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి నాణెం కొనాలంటే.. Buy Now ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. విక్రయించాలంటే.. Make Offer అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇలా మేక్ ఆఫర్‌పై క్లిక్ చేసిన తరువాత.. మీ వద్ద ఉన్న నాణెం ఫొటోను అప్‌లోడ్ చేయాలి. అలా అప్‌లోడ్ చేసిన ఫోటోను ఎవరైనా కొనుగోలుదారులు చూసినట్లయితే.. వారు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఆ తరువాత ఆన్‌లైన్ డెలివరీ, చెల్లింపు విధానంలో మీ నాణాలను విక్రయించవచ్చు. అయితే, ఎంత డబ్బు వస్తుందనేది.. పాత నాణెల సేకరించే ఔత్సాహికుల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ డబ్బు పొందే అవకాశం ఉంది.

Also read: Chanakya Niti: వీరు చేసే తప్పులకు మీరు శిక్ష అనుభావించాల్సి వస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..

Barack Obama Birthday: ఒబామా జేబులో హనుమాన్ ప్రతిమ.. ఆసక్తికర విషయాలు మీకోసం..

Amara Raja Issue: ‘అమరరాజా’ వ్యవహారం ఏంటి?.. ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?.. ప్రభుత్వం ఏమంటోంది?.. పూర్తి వివరాలివే..

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!