Bridge Crash: మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన భారీ వంతెన.. షాకింగ్ వీడియో మీకోసం..

Madhya Pradesh Rains: మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ఉద్ధృతి కారణంగా రెండు వంతెనలు

Bridge Crash: మధ్యప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన భారీ వంతెన.. షాకింగ్ వీడియో మీకోసం..
Mp Floods
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Aug 04, 2021 | 1:51 PM

Madhya Pradesh Rains: మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ఉద్ధృతి కారణంగా రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. భారీ వరదల ధాటికి.. దాటియా పట్టణానికి సమీపంలోని సింధ్ నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. వంతెన కొట్టుకుపోతున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సింధ్ నది ప్రవాహం ప్రళయ రూపంలో ఉండగా.. ఆ వదర ధాటికి వంతెన ముక్కలు ముక్కలైంది. ఈ భీకర దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

భారీ వర్షాల నేపథ్యంలో సింధ్ నడి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో ఆ నదిపై శివపురి జిల్లాలో నిర్మించిన అటల్ సాగర్(మడిఖేడ) ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలారు. కాగా, సోమవారం నుంచి గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షియోపూర్, శివపురి జిల్లాల్లో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 1,600 మందిని సురక్షితంగా కాపాడారు. అయితే, ఇంకా సుమారు 200 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

‘‘గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో మొత్తం 1,171 గ్రామాలు అధిక వర్షపాతం కారణంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివపురి, షియోపూర్ జిల్లాల్లో అనూహ్యంగా 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో అక్కడ భారీ వరదలు సంభవించాయి.’’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే శివపురి, షియోపూర్, గ్వాలియర్, డాటియా జిల్లాలలో సహాయక చర్యల కోసం ఆర్మీని దింపారు. రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ (హోం) రాజేష్ రాజోరా మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్.. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పీఎం హామీ ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా శివపురి-గ్వాలియర్ సెక్షన్ మీదుగా వెళ్లే అనేక రైళ్లు ప్రారంభ స్టేషన్లలో మళ్లించబడడం, నిలిపివేయడం జరుగుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.

Viral Video:

Also read:

Inter-Caste Marriage: కులాంతర వివాహం చేసుకున్నారని రూ. 25.60 లక్షల జరిమానా విధించారు.. ఎక్కడ జరిగిందంటే..

Rare Coins: ఈ మూడు కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా?.. ఉంటే రూ. 20 లక్షల మీసోంతం.. అదెలాగంటే..

చాణక్య నీతి: వీరు చేసే తప్పులకు మీరు శిక్ష అనుభావించాల్సి వస్తుంది.. చాణక్య చెప్పిన కీలక విషయాలు మీకోసం..