Viral Video: తల్లి ప్రేమంటే ఇదేనేమో.. సింహానికి సుస్సుపోయించిన చిరుత.. సీన్ కట్ చేస్తే.!

తల్లి ఎప్పుడూ.. కూడా తన పిల్లలను రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయదు. మనుషులతో పాటు జంతువులకు ఇది వర్తిస్తుంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు చూద్దాం..

Viral Video: తల్లి ప్రేమంటే ఇదేనేమో.. సింహానికి సుస్సుపోయించిన చిరుత.. సీన్ కట్ చేస్తే.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 06, 2024 | 9:24 PM

తల్లి తన పిల్లలను రక్షించుకోవడానికి ఎంత దూరానికైనా వెళ్తుంది. ఈ సామెత మనుషులకు మాత్రమే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. మూగజీవులు సైతం తమ పిల్లలను రక్షించుకునేందుకు ప్రాణాలను సైతం త్యాగం చేస్తాయి. అలాంటి వీడియోలు సైతం మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ తల్లి చిరుత తన పిల్లలను ఓ సింహం నుంచి కాపాడేందుకు ఎంతకు తెగించిందో చూస్తే.. మీరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రస్తుతం నెట్టింట ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటన టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో జరిగింది.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ తల్లి చిరుత.. తన వైపు వస్తోన్న సింహాన్ని గమనించి.. తన బిడ్డలను రక్షించుకునేందుకు ఆ అడవి రారాజుతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడింది. తన పిల్లలపై ఈగ వాలకుండా చిరుత భీకర యుద్ధం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘తల్లి చిరుత తన పిల్లలను రక్షించడానికి ప్రాణాలను త్యాగం చేస్తుంది’ అని క్యాప్షన్ పెట్టారు లేటెస్ట్ సైటింగ్స్‌ అనే యూట్యూబ్ ఛానెల్. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..