Viral News: ఓటు వేయలేదని ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!

మనస్పర్థలు, గొడవలు, సందేహాలు తదితర కారణాల వల్ల వివాహలు, నిశ్చితార్థాలు క్యాన్సిల్ అయి ఉండడం మనం చూసి ఉంటాం. కానీ అమెరికాలో విచత్రమైన ఓ సంఘటన జరిగింది. అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తనకు కాబోయే భర్త ఓటు వేయడానికి నిరాకరించినందుకు ఒక యువతి తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసింది.

Viral News: ఓటు వేయలేదని ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!
Woman Wants To Break Off Engagement
Follow us

|

Updated on: Nov 06, 2024 | 9:18 PM

సర్వత్రా ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ఈ నెల నవంబర్ 5న జరిగింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య హారాహారిగా పోటీ నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ ఎన్నికల వేళ ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. తన కాబోయే భర్త ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరాకరించినందుకు ఒక యువతి తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అధ్యక్ష ఎన్నికల్లో తన భర్త ఓటు వేయడానికి నిరాకరించడంతో తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని అమెరికా యువతి నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకుంది. ‘నేను ఫ్లోరిడాలో నివసిస్తున్న ఒక యువతిని, నా కాబోయే భర్త US అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరాకరించినందున అతనితో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నాను. రెండు పార్టీల అభ్యర్థులు నచ్చకపోవడంతో ఓటు వేయడానికి అంగీకరించలేదు. ఇది నాకు నైతిక సందిగ్ధంలో పడింది. ఓటు వేయకపోతే, నేను ఖచ్చితంగా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేస్తాను” అని ఆమె సుదీర్ఘ పోస్ట్‌లో రాసింది.

రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటు వేయాలా వద్దా అనేది అతని వ్యక్తిగత నిర్ణయం. దీని కోసం మీరు ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “మీ ఇద్దరూ ఈ విలువలతో సరిపోలకపోతే, మీరు విడిపోవాలి” మరో నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో కొందరు యువతి నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందరు ఓటు వేయడం వ్యక్తిగత ఎంపిక అని, తన వ్యక్తిగ సంబంధాన్ని ప్రభావితం చేయకూడదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి