Viral News: వామ్మో.. ఇది మామూలు కోతి కాదు.. కోర్టులోనే..
కోతులు.. ఇవి అల్లరికి మారు పేరు.. అందుకే మనం అప్పుడప్పుడు ఎవరైనా అల్లరి చేస్తే కోతిలాగా బిహేవ్ చేయకు అని అంటూ ఉంటాం..కోతులు అల్లరి చిలిపి పనులు చేసినా.. అవీ చాలా తెలివైనవి అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు
కోతులు.. ఇవి అల్లరికి మారు పేరు.. అందుకే మనం అప్పుడప్పుడు ఎవరైనా అల్లరి చేస్తే కోతిలాగా బిహేవ్ చేయకు అని అంటూ ఉంటాం..కోతులు అల్లరి చిలిపి పనులు చేసినా.. అవీ చాలా తెలివైనవి అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. మనిషిలాగే అవి కూడా బీహేవ్ చేస్తాయి. అందుకేనేమో మనుషులు కూడా కోతుల నుంచి వచ్చారని పెద్దలు చెప్తుంటారు. తాజాగా ఓ కోతి కోర్టులో చేసిన పని చూస్తే నవ్వు ఆపుకోకుండా ఉండలేరు.. ప్రస్తుతం ఆ వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది.
ఢిల్లీ హైకోర్టు ఆవరణలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ కోతి కోర్టు గది వెలుపల ఉన్న షెల్ఫ్ నుంచి టిఫిన్ బ్యాగ్‌ని దొంగిలించింది. సుమారు అర నిమిషం పాటు టిఫిన్ బ్యాగ్ నుంచి లంచ్‌బాక్స్‌ను తీసివేయడానికి ప్రయత్నించింది. టిఫిన్ మూత ఓపెన్ ఎంతకీ కోతికి ఓపెన్ కాలేదు. ఈ దృశ్యాలను చుట్టూ ఉన్న లాయర్లు, సందర్శకులు వీడియోలు తీసుకుంటున్నారు. కోతి చేసిన పనికి అక్కడ ఉన్నవారందరూ పగలబడి నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే తన ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. రాముడు తన దౌత్యవేత్తను కోర్టుకు పంపాడని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కోతి భోజనం చేసి వెళ్లిపోయిందా లేక నిరాశతో వదిలేసిందా అని మరికొందరు పేర్కొంటున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదిగో:
The corridors of the Supreme Court had got some unusual visitors recently pic.twitter.com/nTxLNi8SNQ
— SANJAY HEGDE (@sanjayuvacha) October 5, 2024