Viral Video: రోడ్డుమీద కుప్పకూలిన హెలికాప్టర్.. తప్పిన ప్రమాదం.. లైవ్ వీడియో వైరల్.!
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సహాయం అందించేందుకు వెళుతున్న హెలికాప్టర్‌లో లోపం తలెత్తి ప్రమాదానికి గురైంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెక్సికోలో ఓ నావీ హెలికాప్టర్ కుప్పకూలింది. లాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. హారికెన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇక అప్పటికే కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. గాల్లోనే పలు రౌండ్లు చక్కర్లు కొడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక ప్రమాదం జరిగే సమయంలో.. స్పాట్‌లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ హెలికాప్టర్‌లో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారని నావికాదళ అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.