పామును హెయిర్ బ్యాండ్‌గా ధరించిన మహిళ.. నెటిజన్లు షాక్..!వీడియో వీడియో..:Snake as a Hair Band Viral Video.
అందరికీ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా ఇట్టే సమాచారం అరచేతిలోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా వైరల్ వీడియాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట హంగామా చేస్తోంది. ఓ మహిళ షాపింగ్ చేయడానికి...
‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అని అంటుంటారు. సమాజంలో ఉన్న కొందరిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నలుగురు ఒక దారిలో వెళితే వారు మరో దారిలో వెళుతుంటారు. నలుగురు చేసే పని మేము చేయమంటూ వెరైటీగా ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఇలాంటి వింత వ్యక్తులు ఇటీవల ప్రపంచానికి ఎక్కువగా పరిచయమవుతున్నారు. దీనికి కారణం సోషల్ మీడియా విస్తృతి పెరగడమే. అందరికీ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా ఇట్టే సమాచారం అరచేతిలోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా వైరల్ వీడియాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట హంగామా చేస్తోంది. ఓ మహిళ షాపింగ్ చేయడానికి మాల్‌కు వెళ్లింది. ఆ సమయంలో మాల్‌లో ఉన్న వారంతా ఆమె తలపై ఆసక్తిగా చూడడం గమనించారు. దీనికి కారణంగా ఆమె జుట్టుకు విచిత్రమైన ఓ హెయిర్ బ్యాండ్ ఉండడమే. మొదట్లో అందరూ అది ఒక రకమైన హెయిర్ బ్యాండ్ అనుకున్నారు. కానీ అది కదులుతుండడంతో అదొక పాము అని గుర్తించారు. దీంతో వెంటనే అక్కడే ఉన్న ఓ వ్యక్తి సదరు మహిళ తలపై పెట్టుకున్న పామును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు ఇదేం పాడు ఆలోచన అని అంటుంటే మరికొందరు మాత్రం చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తుండడం గమనార్హం. మరి ఈ పాము హెయిర్ బ్యాండ్ ఎలా ఉందో మీరూ చూసేయండి.
మరిన్ని ఇక్కడ చూడండి: కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్..! నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..:Prakash Raj Remarried Video.
వామ్మో..స్కూటీ డిక్కీలో నాగుపాము..! ఎలా వచ్చిందో తెలిసా..?షాక్ లో ఓనర్..:Snake Viral Video.
నడిరోడ్డుపై భారీ అనకొండ.. ఈ రేంజ్ అనకొండ ఎప్పుడు చూడలేదంటూ కామెంట్స్..Viral Video.
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

