Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బాబోయ్‌ ఎండలు.. బాంబులా పేలి గాల్లోకి ఎగిరిన మారుతీ వ్యాన్.. భయాన దృశ్యాలు చూస్తే వణుకే!

కారులో మంటలు చెలరేగడంతో పాటు ఒక్కసారిగా కారు పేలిపోయింది. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్‌ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్‌ గాల్లోకి ఎగిరి పడింది. ఈ భయానక ఘటన కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Watch Video: బాబోయ్‌ ఎండలు.. బాంబులా పేలి గాల్లోకి ఎగిరిన మారుతీ వ్యాన్.. భయాన దృశ్యాలు చూస్తే వణుకే!
Maruti Van Thrown Into Air
Follow us
Jyothi Gadda

|

Updated on: May 11, 2024 | 6:35 PM

పార్క్ చేసిన కార్లు, బైకులకు నిప్పు అంటుకున్న ఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదవుతున్నాయి. ఫలితంగా కార్లు, ఇతర పార్క్ చేసిన వాహనాలకు మంటలు అంటుకుని పేలిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి వాహనం పేలడంతో వ్యాన్‌ గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియా వినియోగదారులను షాక్‌కు గురిచేస్తుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక కారు మంటల్లో చిక్కుకున్న ఘటన చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌లోని ఖాన్‌పూర్ మార్కెట్ మధ్యలో ఉంచిన మారుతీ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. కారు నుండి భారీ మంటలు వ్యాపించాయి. కారులో మంటలు చెలరేగడంతో పాటు ఒక్కసారిగా కారు పేలిపోయింది. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్‌ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్‌ గాల్లోకి ఎగిరి పడింది. ఈ భయానక ఘటన కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

కారులో మంటలు చెలరేగడంతో జరిగిన భారీ పేలుడును చూసిన ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినప్పుడు కారులో, సమీపంలో ఎవరూ లేరు. మారుతీ వ్యాన్ సిఎన్‌జితో నడిచే కారు అని, కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ కారణంగా పేలుడు సంభవించిందని వార్తలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
శాంతి వైపే భారత్ అడుగులు.. వైరం ఎప్పటికీ కోరదు..
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
IPL 2025: ఆర్‌సీబీలో విరాట్ కోహ్లీ రీప్లేస్‌మెంట్ వీళ్లే భయ్యా
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. వివేకుని మాటే..
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: మోదీ
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. ఆ కీలక నిబంధనల మార్పు
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు!సడెన్‌గా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ
ఇది కదా దయాగాడి దండయాత్ర..
ఇది కదా దయాగాడి దండయాత్ర..
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
మూడేళ్లల్లో ఎఫ్‌డీలపై ముచ్చటైన రాబడి..ది బెస్ట్ మూడు బ్యాంకులివే!
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
ఐపీఎల్‌లో డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే.. కోహ్లీకి మాత్రం నో ప్లేస్
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే
చూసే చూపులోనే ఉందంతా.. మీరెలాంటి వారో మీ చూపే చెప్తుంది! ఎలాగంటే