Watch Video: రిల్స్‌ పిచ్చితో యువతి రచ్చ… తుపాకీతో హైవేపై హల్‌చల్‌..! కట్‌ చేస్తే..

చేతిలో తుపాకీతో హైవేపై డ్యాన్స్ చేస్తూ యువతి హల్‌చల్‌ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపింది. ఇన్‌స్టా రీల్స్ పిచ్చితోనే ఆమె ఈ స్టెప్పులేసిందంటూ వీడియోపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి చట్టం, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు.

Watch Video: రిల్స్‌ పిచ్చితో యువతి రచ్చ... తుపాకీతో హైవేపై హల్‌చల్‌..! కట్‌ చేస్తే..
Gun Dance
Follow us
Jyothi Gadda

|

Updated on: May 11, 2024 | 6:16 PM

ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్ ట్రెండ్‌ కొనసాగుతోంది. జనాల్లో పాపుల‌ర్ అయ్యేందుకు చాలా మంది సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ర‌క‌ర‌కాల వీడియోలు, రీల్స్‌ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. చేతిలో తుపాకీతో హైవేపై డ్యాన్స్ చేస్తూ యువతి హల్‌చల్‌ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపింది. ఇన్‌స్టా రీల్స్ పిచ్చితోనే ఆమె ఈ స్టెప్పులేసిందంటూ వీడియోపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి చట్టం, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు.

ఈ వీడియోలో ఓ మహిళ లక్నోలోని హైవే మధ్యలో భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసింది. చేతిలో తుపాకీ పట్టుకుని ఆకాశం వైపు చూపిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించారు. వీడియోలో కనిపించిన లక్నోకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ స్టార్ సిమ్రాన్ యాదవ్ హైవేపై ఇలా రెచ్చిపోయి డ్యాన్స్‌ చేశారు. హైవే మధ్యలో భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేస్తూ.. చేతిలో తుపాకీ పట్టుకుని ఆకాశం వైపు చూపిస్తూ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను లాయర్ కళ్యాణ్‌జీ చౌదరి X ఖాతాలో షేర్ చేయడం ద్వారా లక్నో పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చట్టాన్ని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్నో పోలీసులు వెంటనే స్పందించారు. వీడియోపై విచారణ జరపాలని ఆదేశించారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఎంటుచ సిమ్రాన్ యాదవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో 1.8 మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..