AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video today: ఎలా వస్తాయిరా అయ్యా మీకు ఇలాంటి ఐడియాలు.. ఇస్త్రీ ఇలా కూడా చేస్తారా..? చూస్తే షాక్‌ అవుతారు..

ఈ జుగాడ్‌ వైరల్‌ వీడియోకు అద్భుతమైన వీక్షణలు వచ్చాయి. వైరల్‌ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఈ జుగాడ్‌ను ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ జుగాడ్ నిజంగా వెరీ స్మార్ట్‌ అంటున్నారు నెటిజన్లు. మీరు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటివి ట్రై చేయవచ్చు అంటున్నారు.. ఈ వీడియోకు ఇప్పటివరకు 7.2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే 88 వేల మందికి పైగా లైక్ చేశారు.

Viral Video today: ఎలా వస్తాయిరా అయ్యా మీకు ఇలాంటి ఐడియాలు.. ఇస్త్రీ ఇలా కూడా చేస్తారా..? చూస్తే షాక్‌ అవుతారు..
Pressure Cooker To Iron Shirts
Jyothi Gadda
|

Updated on: May 11, 2024 | 3:14 PM

Share

మన దేశంలో ప్రతి సమస్యకు జుగాడ్‌ ద్వారా పరిష్కారం లభిస్తుంది. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఇలాంటి జుగాడ్‌ వీడియోలు చాలానే కనిపిస్తున్నాయి. అలాంటి వీడియోలు చూసిన తర్వాత మనల్ని ఆలోచింపజేసేవి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. అయితే, మీరు మీ బట్టలు నలిగి పోయి ఉంటే.. ఏం చేస్తారు.. బాగా ఐరన్‌ చేసుకుంటారు. అందుకోసం మీరు మీ బట్టల్ని లాండ్రీకి గానీ, లేదంటే, మీ ఇంట్లో ఐరన్‌ బాక్స్‌తోనో ఐరన్‌ చేసుకుంటారు. అయితే, ఈ రెండు మీకు అందుబాటులో లేకుంటే ఏం చేస్తారు..? బహుశా మీరు ఇలాంటి పరిష్కారం అస్సలు ఊహించి ఉండరు..నలిగిపోయిన బట్టలు ఇస్త్రీ చేసేందుకు ఇంట్లోనే చక్కటి ఉపాయం ఆలోచించాడు ఇక్కడో వ్యక్తి. ఈ జుగాడ్‌ని ఒక్కసారి చూస్తే ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు. ఇంత బ్రెయిన్ పవర్ ఉన్న వ్యక్తిని పొగడకుండా ఉండలేరు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో Instagram హ్యాండిల్ @deepakjaiswal9902లో షేర్‌ చేయబడింది. వీడియోలో ఒక చిన్న వంటగదిలో ఓ వ్యక్తి తన బట్టలు ఐరన్‌ చేసుకుంటున్నాడు. దాని కోసం అతడు ఐరన్‌ బాక్స్‌కు బదులుగా ప్రెజర్‌ కుక్కర్‌ను ఉపయోగిస్తున్నాడు. కుక్కర్‌ సాయంతో చొక్కాను ఐరన్‌ చేస్తున్నాడు. అచ్చం ఇస్త్రీ పెట్టెతో చేసినట్టుగానే అతడి షర్ట్‌ చాలా నీట్‌గా, సాఫ్ట్‌గా అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ జుగాడ్‌ వైరల్‌ వీడియోకు అద్భుతమైన వీక్షణలు వచ్చాయి. వైరల్‌ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఈ జుగాడ్‌ను ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ జుగాడ్ నిజంగా వెరీ స్మార్ట్‌ అంటున్నారు నెటిజన్లు. మీరు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటివి ట్రై చేయవచ్చు అంటున్నారు.. ఈ వీడియోకు ఇప్పటివరకు 7.2 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే 88 వేల మందికి పైగా లైక్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..