Shrimp squat video: మీ ఫిట్‌నెస్‌కి ఛాలెంజ్‌..! ఇంటర్‌నెట్‌లో ట్రెండ్‌ అవుతున్న కొత్త ఎక్సర్‌సైజ్.. మీరూ ట్రై చేయండి..

ఈ 58-సెకన్ల క్లిప్ ఏదో ఒక ఆఫీసులో ట్రై చేసినట్టుగా అర్థమవుతోంది. వీడియోలో కనిపించిన వ్యక్తులు ఈ ఫ్లెక్సిబిలిటీ టాస్క్‌ని పూర్తి చేస్తున్నారు. 15 మంది వ్యక్తులు ఈ ఛాలెంజ్‌ని ప్రయత్నించారు. అందులో ఐదుగురు మాత్రమే దీన్ని పూర్తి చేయగలిగారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.8 కోట్ల మంది వీక్షించారు. 34 వేలకు పైగా లైక్ చేసారు. చాలా మంది ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ప్రయత్నిస్తున్నారు.

Shrimp squat video: మీ ఫిట్‌నెస్‌కి ఛాలెంజ్‌..! ఇంటర్‌నెట్‌లో ట్రెండ్‌ అవుతున్న కొత్త ఎక్సర్‌సైజ్.. మీరూ ట్రై చేయండి..
Shrimp Squat Challenge
Follow us
Jyothi Gadda

|

Updated on: May 11, 2024 | 1:47 PM

సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌లు వస్తూనే ఉంటాయి. కానీ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే.. దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే.. ఈ ఫిట్‌నెస్ టాస్క్ అంత సులభం కాదు. మీరు కూడా సోషల్ మీడియా యూజర్ అయితే, మీ ఫిట్‌నెస్‌ను పరీక్షించడానికి కొత్త ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్ పేరు ‘ష్రిమ్ప్ స్క్వాట్’. ఇది ఇంటర్నెట్‌లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఇందుకోసం ఒంటికాలిపై బ్యాలెన్స్ చేస్తూ లేవాలి. ఈ ఫిట్‌నెస్ టాస్క్ అంత సులభం కానప్పటికీ, చాలా మంది దీనిని ప్రయత్నిస్తున్నారు. ఆఫీసు, ఇల్లు, పార్క్‌ ఇలా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ జనాలు ఈ టాస్క్‌ కంప్లీట్‌ చేసేందుకు తెగ తిప్పులు పడుతున్నారు. వారి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. ఆ సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఛాలెంజ్‌లో ముందుగా రెండు మోకాళ్లతో నేలపై కూర్చోవాలి.  ఆ తర్వాత ఒక కాలును చేతితో వెనుకకు పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కకాలితో మాత్రమే పైకి లేవాలి. ఈ ఛాలెంజ్ మీ శరీరం బలం, ఫిట్‌నెస్‌ గురించి చెబుతుంది. స్క్వాట్స్ మీ శరీరంలో కండరాలు, వశ్యతను పెంచుతాయి. అలాగే మీ దిగువ శరీరాన్ని బలోపేతం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

‘@TheFigen_’ హ్యాండిల్‌తో ఉన్న వినియోగదారు ఈ ఛాలెంజ్ వీడియోను మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘X’లో షేర్ చేసారు. ఈ 58-సెకన్ల క్లిప్ ఏదో ఒక ఆఫీసులో ట్రై చేసినట్టుగా అర్థమవుతోంది. వీడియోలో కనిపించిన వ్యక్తులు ఈ ఫ్లెక్సిబిలిటీ టాస్క్‌ని పూర్తి చేస్తున్నారు. 15 మంది వ్యక్తులు ఈ ఛాలెంజ్‌ని ప్రయత్నించారు. అందులో ఐదుగురు మాత్రమే దీన్ని పూర్తి చేయగలిగారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.8 కోట్ల మంది వీక్షించారు. 34 వేలకు పైగా లైక్ చేసారు. చాలా మంది ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను ప్రయత్నిస్తున్నారు. వీడియోపై ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియోపై స్పందిస్తూ..ఒక వినియోగదారు ఇలా అన్నారు. ‘ఇది బలం, సమతుల్యతతో కూడిన గేమ్. దీనికోసం ప్రజలు మంచి ఎక్సర్‌సైజ్‌ సెంటర్‌కి వెళ్లాలని చెబుతున్నారు. ఈ ఛాలెంజ్‌తో విసిగిపోయిన మరో యూజర్ స్పందిస్తూ ఇలాంటి ఛాలెంజ్‌లు ఎక్కడ్నుంచి పట్టుకోస్తారని అడుగుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..