Watch Video: వార్నీ.. మీరేక్కడ దొరికార్రా బాబు.. విమానంలో సీటు కోసం ముష్టి యుద్ధం చేసిన ప్యాసింజర్లు.. చూస్తే అవాక్కే..!

విమానంలో ఓ సీటు కోసం ఇద్ద‌రూ ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఈవా ఎయిర్ విమానంలో జ‌రిగింది. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న విమానంలో.. సీటు కోసం ఇద్ద‌రు ప్రయాణికులు ముష్టి యుద్ధానికి దిగారు. ఫ్ల‌యిట్ అటెండెంట్లు ఆ ఇద్ద‌ర్నీ ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. దీనికి కారణం ఏంటనే విషయంలోకి వెళితే..

Watch Video: వార్నీ.. మీరేక్కడ దొరికార్రా బాబు.. విమానంలో సీటు కోసం ముష్టి యుద్ధం చేసిన ప్యాసింజర్లు.. చూస్తే అవాక్కే..!
Passengers Fight
Follow us
Jyothi Gadda

|

Updated on: May 09, 2024 | 2:14 PM

ఇటీవలి కాలంలో విమానాల్లో తరచూ జరుగుతున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని కొన్ని సంఘటనలు విమానప్రయాణికుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు సాధారణ బస్సులు, ప్యాసిండర్‌ రైళ్లలో ప్రయాణికులు కొట్టుకోవడం, గొడవపడటం చూశాం. అయితే విమానంలో సీటు కోసం ప్యాసింజర్లు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా, అలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవపడ్డారు. ఈ ఘ‌ట‌న ఈవా ఎయిర్ విమానంలో జ‌రిగింది. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న విమానంలో.. ఓ సీటు కోసం ఇద్ద‌రు పంచ్‌లు విసురుకున్నారు. వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

విమానంలో ఓ సీటు కోసం ఇద్ద‌రూ ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఈవా ఎయిర్ విమానంలో జ‌రిగింది. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న విమానంలో.. సీటు కోసం ఇద్ద‌రు ప్రయాణికులు ముష్టి యుద్ధానికి దిగారు. ఫ్ల‌యిట్ అటెండెంట్లు ఆ ఇద్ద‌ర్నీ ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. దీనికి కారణం ఏంటనే విషయంలోకి వెళితే..

ఇవి కూడా చదవండి

విమానం తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్లాలంటే సుమారు 11 గంట‌ల సమయం పడుతుంది. జర్నీలో ఓ ప్ర‌యాణికుడి ప‌క్క‌న కూర్చున్న మ‌రో ప్యాసింజెర్ ఏక‌ధాటిగా ద‌గ్గుతూ ఉన్నాడు. దీంతో ద‌గ్గే వ్య‌క్తి ప‌క్క‌న ఉన్న ప్యాసింజ‌ర్ .. స‌మీపంలో ఖాళీగా ఉన్న ఓ సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఈలోగా ఆ సీటు ఒరిజన‌ల్ ప్యాసింజెర్ రావ‌డంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆ ఇద్ద‌రూ కాసేపు బాహబాహీ తనుకున్నారు. చివరకు విమానం శాన్‌ఫ్రాన్సిస్‌కో చేరుకున్న త‌ర్వాత ఆ ఇద్ద‌ర్నీ పోలీసుల‌కు అప్ప‌గించారు విమాన సిబ్బంది. ఇదంతా వీడియో తీయగా, ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, ఎమోజీలతో తీవ్రంగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..