AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: మనం ధరించే రబ్బర్‌ చెప్పులను ఎలా తయారు చేస్తారో తెలుసా.? వీడియో చూసేయండి..

మరి ప్రతీ రోజూ మన జీవితంలో నిత్యవసరంగా మారిన చెప్పులను అసలు ఎలా తయారు చేస్తారు. ఇందుకు అవసరమైన మెటిరీయిల్‌గా ఎలా రూపొందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో సహజంగానే ఉంటుంది. అయితే చెప్పులు తయారయ్యే ఫ్యాక్టరీలోకి అందరినీ అనుమతించారు. కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియోలో...

Viral News: మనం ధరించే రబ్బర్‌ చెప్పులను ఎలా తయారు చేస్తారో తెలుసా.? వీడియో చూసేయండి..
Slipper Making Video
Narender Vaitla
|

Updated on: May 09, 2024 | 2:26 PM

Share

మనిషికి దుస్తులు ఎంత ముఖ్యమో చెప్పులు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడుగు బయటపెట్టాలంటే కచ్చితంగా చెప్పులు ఉండాల్సిందే. ఇక చెప్పుల్లో కూడా ఎన్నో రకాల మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం చెప్పుల ఇండస్ట్రీ కూడా కోట్ల రూపాయలను తెచ్చి పెడుతోంది.

మరి ప్రతీ రోజూ మన జీవితంలో నిత్యవసరంగా మారిన చెప్పులను అసలు ఎలా తయారు చేస్తారు. ఇందుకు అవసరమైన మెటిరీయిల్‌గా ఎలా రూపొందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో సహజంగానే ఉంటుంది. అయితే చెప్పులు తయారయ్యే ఫ్యాక్టరీలోకి అందరినీ అనుమతించారు. కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియోలో మనం ధరించే చెప్పులను ఎలా తయారు చేస్తారో పూర్తిగా వివరించారు.

ఈవీడియోలో మనం ధరించే రబ్బర్‌ చెప్పుల తయారీ విధానాన్ని రూపొందించారు. ఇందుకోసం ముందుగా పాడైనా రబ్బర్‌ను అంతా తీసుకున్నారు. దానంతటినీ ఒక చోట చేర్చి. వేడితో పూర్తిగా రబ్బర్‌ కరిగేలా చేస్తారు. అనంతరం అందులో బ్లూ కలర్‌ను యాడ్‌ చేస్తారు. తర్వాత పాత ప్లాస్టిక్‌ వ్యర్థాలు మొత్తం ఒక ముద్దలా బయటకు వస్తుంది. తర్వాత ఈ రబ్బర్‌ను బల్లపరుగా మార్చి చెప్పు సైజ్‌కు తగ్గట్లుగా కట్ చేస్తారు. ఆ తర్వాత జోడ్లను అతికిస్తారు. చెప్పడానికి ఈ విధానం సింపుల్‌గానే ఉన్నా తయారీ విధానం మాత్రం అంత సింపుల్‌గా ఏం లేదు. ఈ మీడియో చూస్తే మీరు కూడా ఇదే అంటారు.

రబ్బరు చెప్పుల తయారీ వీడియో..

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. నిజానికి ఈ వీడియోను గతంలోనే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా తాజాగా మళ్లీ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. మనం ఎంతో సింపుల్‌గా ధరించే చెప్పుల వెనకాల ఇంత కష్టం దాగి ఉంటుందా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక వీడియోను నెటిజన్లు తెగ లైక్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 23 లక్షల వరకు లైక్‌ కొట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..